Saturn Transit 2024: కుంభ రాశిలో శని కదలికలు.. ఈ రాశులవారికి శనిదేవుడి కటాక్షం కలగడం ఖాయం..

Saturn Transit 2024: మార్చి 18న కుంభ రాశిలో శని గ్రహం కదలిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 13, 2024, 04:59 PM IST
Saturn Transit 2024: కుంభ రాశిలో శని కదలికలు.. ఈ రాశులవారికి శనిదేవుడి కటాక్షం కలగడం ఖాయం..

Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అంతేకాకుండా శని గ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే  జీవితంలో ఆనందం, శ్రేయస్సుకు ఎలాంటి డోకా ఉండదు. అయితే ఇదే గ్రహం అశుభస్థానంలో ఉంటే జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ గ్రహం రాశిలో కదలికలు జరిపినప్పుడు కూడా అశుభ, శుభ ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ శని గ్రహం మార్చి 18వ తేదిన కుంభ రాశిలో కదలికలు జరపబోతున్నాడు. దీని కారణంగా హోలీకి కొన్ని రోజుల ముందు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి లాభాలే..లాభాలు:
తుల రాశి: 

శని గ్రహం కుంభ రాశిలో కదలికలు జరపడం కారణంగా తుల రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. అంతేకాకుండా విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అలాగే వృత్తిపరమైన జీవితం గడుపుతున్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. 

ధనుస్సు రాశి: 
కుంభరాశిలో శని గ్రహం కదలిక జరపడం వల్ల ధనుస్సు రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక ఉద్యోగాలు చేసేవారు బాస్‌ నుంచి మంచి లాభాలు పొందుతారు. అలాగే సహోద్యోగుల సపోర్ట్‌ లభించి లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన పనుల్లో కూడా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

వృషభ రాశి: 
కుంభ రాశిలో శని గ్రహం కదలికల కారణంగా వృషభ రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఊహించని ధన లాభాలు కూడా పొందుతారు. అలాగే మనస్సులో సంతోషం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వీరు ఇతరల నుంచి శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా కష్టపడి పనులు చేయడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News