Saturn-Venus Transit: 500 సంవత్సరాల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు..ఈ రాశులవారికి పండగే..

Saturn-Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో రెండు గ్రహాలు కలవడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశులవారిపై పడి..వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 03:24 PM IST
 Saturn-Venus Transit: 500 సంవత్సరాల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు..ఈ రాశులవారికి పండగే..

Saturn-Venus Transit: ప్రతి నెల ఏదో ఒక గ్రహం సంచారం చేస్తుంది. ఈ గ్రహ సంచారాల వల్ల అశుభ, శుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకే రాశిలో రెండు గ్రహాల సంయోగం చేయడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాలు మొత్తం 12 రాశులవారిపై ప్రభావం చూపుతాయి. సుమారు 500 సంవత్సరాల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. మార్చి నెలలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడితే..ఆ తర్వాత షష  రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రెండు రాజయోగాల ప్రభావం అన్ని రాశులవారిపై పడబోతోంది. ముఖ్యంగా ఈ ప్రభావం కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావాన్ని చూపబోతోంది. అయితే ఈ రెండు రాజయోగాల కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మిథున రాశి:
శని-శుక్రుల సంచారం కారణంగా ఏర్పడే ప్రత్యేక యోగాల ప్రభావం మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారం చేసేవారు వ్యాపార రంగంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఈ సమయంలో ఎలాంటి పనిలోనైన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఈ సమయంలో వీరు పెద్దగా కష్టపడకుండానే డబ్బులు పొందుతారు. ఇక ఆస్తుల పరంగా ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవ్వడమే కాకుండా కోర్టు కేసుల్లో సులభంగా విజయాలు కూడా సాధిస్తారు. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు.

తులారాశి:
ఈ రెండు రాజయోగాల ప్రభావం తులారాశివారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. శని, శుక్ర గ్రహాల ప్రభావం కారణంగా  ఈ రాశివారికి స్థానం, ప్రతిష్టలు పెరుగుతాయి. తుల రాశివారు పిల్లలకు సంబంధించి త్వరలోనే శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు సులభంగా కోరికలు నెరవేరుతాయి. 

కుంభ రాశి:
శని-శుక్రుని సంచారం కుంభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుంభ రాశి వారికి ఈ సమయంలో సులభంగా ఆదాయం పెరగడమే కాకుండా ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం చేసే వారు కొత్త పెట్టుబడిదారులను పొందుతారు. దాంపత్య జీవితంలో మధురమైన రోజులు కూడా ప్రారంభమవుతాయి.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News