Shani Dev: శని గ్రహంలో పెద్ద మార్పులు..ఈ 3 రాశుల వారికి ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయా?

Direct Saturn Retrograde: జూన్ 30వ తేదీన కొన్ని రాశుల వారిపై శని గ్రహ ప్రత్యక్ష తిరోగమనం ప్రభావం పడబోతోంది. దీని కారణంగా కొందరు లాభాలు పొందితే, మరికొందరు తీవ్ర దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 01:08 PM IST
Shani Dev: శని గ్రహంలో పెద్ద మార్పులు..ఈ 3 రాశుల వారికి ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయా?

 

Direct Saturn Retrograde: శని గ్రహం కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశి సంచారం చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన సమయాల్లో ప్రత్యక్ష తిరోగమనం వంటి మార్పులు వస్తూ ఉంటాయి. శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో ఉంది. అయితే కుంభరాశిలో ఉంటూనే తిరోగమనం చేస్తూ ఉంటుంది. ఈ కమలంలో మార్పుల కారణంగా కొన్ని శుభ యాదృచ్ఛికాలు ఏర్పడతాయి. దీని కారణంగా రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని రివర్స్‌లో తిరోగమనం చేయబోతున్నాడు. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి జూన్ 30 తర్వాత ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే శని తిరోగమనం కారణంగా ఏయే రాశుల వారికి మంచి గడియలు ప్రారంభమవుతాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి:
మేష రాశి వారికి శనీతి రోగంలా కారణంగా మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించి.. కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అంతేకాకుండా జూన్ 30 తర్వాత కష్టపడి పని చేయడం వల్ల మాత్రమే సులభంగా విజయాల సాధిస్తారు. లేకపోతే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇదే సమయంలో కొత్త వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల ఇద్దరు మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

మిథున రాశి:
శని తిరోగమన కారణంగా మిథున రాశి వారికి కొన్ని లాభాలతో పాటు నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం ఎంతో శుభప్రదమైనది. కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాయడం వల్ల ఊహించని విజయాలు సాధిస్తారు. దీంతో పాటు శత్రువులపై కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్టు లభిస్తుంది. వృత్తిపరమైన జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

కన్యా రాశి:
శని గ్రహం తిరోగమన ప్రభావం కన్యా రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అయితే చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి పని ఒత్తిడి పెరిగి ఇతర సమస్యలు కూడా రావచ్చు. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు విజయం కోసం కొంత కష్టపడాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News