Shani dev: 2023లో ఈరాశుల వారిపై శని ధైయా ప్రారంభం... వీరికి కష్టాలే కష్టాలు..

Saturn Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శనిదేవుడు సంచరించిన వెంటనే కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశి వారిపై ధైయా ప్రభావం మొదలవుతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 04:06 PM IST
Shani dev: 2023లో ఈరాశుల వారిపై శని ధైయా ప్రారంభం... వీరికి కష్టాలే కష్టాలు..

Saturn Transit In Kumbh 2023: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుని సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. రెండున్నరేళ్లకొకసారి శనిదేవుడు తన రాశిని మారుస్తుంది. గ్రహాలు అన్నింటిలో కెల్లా శనిదేవుడు చాలా నెమ్మెదిగా ప్రయాణిస్తాడు. శనిదేవుడు కృప ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారుతాడు. శని వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారు జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కొత్త ఏడాది ప్రారంభం అంటే జనవరి 17 శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శనిదేవుడు సంచారం స్టార్ట్ అవ్వగానే కొన్ని రాశులవారిపై శని సడేసతి మరియు ధైయా మెుదలవుతుంది. 

వేద పంచాంగం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే కర్కాటక, వృశ్చిక రాశి వారిపై శనిదేవుడి ధైయా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే శనిదేవుడు కర్కాటక రాశివారి సంచార జాతకంలోని  ఎనిమిదవ ఇంట్లోనూ, వృశ్చిక రాశి జాతకంలోని నాల్గవ ఇంట్లోనూ సంచరిస్తాడు. దీని కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. శని ధైయా మెుదలైన వెంటనే ఆఫీసులో మీ జూనియర్ లేదా సీనియర్‌తో సంబంధాలు చెడిపోవచ్చు. ఆర్థికంగా మీరు డబ్బు నష్టపోతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఈ టైంలో పెట్టుబడుల పెట్టకండి. 

Also Read: Surya Shani Yuti 2023: శని, సూర్యల 'అశుభ యోగం'.. 2023లో వీరి జీవితం కష్టాలమయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News