Shani gochar 2023: శతభిష నక్షత్రంలోకి శని.. ఈ 6 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!

Shani Gochar 2023: శతభిషా నక్షత్రంలో శని సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, అయితే కొన్ని రాశుల వారికి  అనుకూలంగా ఉంటే కొన్ని రాశులు వారు మాత్గురం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 10, 2023, 10:36 PM IST
Shani gochar 2023: శతభిష నక్షత్రంలోకి శని.. ఈ 6 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!

Shani Gochar 2023 Effect: మన పూర్వీకులు మనకు అందించిన జ్యోతిషశాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో 24వ స్థానంలో శతభిషా నక్షత్రం ఉంది. ఈ శతభిషా నక్షత్రానికి అధిపతి రాహువు. మార్చి 15, 2023న ఉదయం 11.40 గంటలకు శనిదేవుడు శతభిషా నక్షత్రంలో మొదటి దశలోకి ప్రవేశించనున్నాడు. వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని చేరేలా చేస్తే కొందరు శనిగ్రహ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఆరు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

వృషభ రాశి:
వృషభ రాశికి చెందిన స్థానికులకు ఉద్యోగ మార్పు లేదా బదిలీ అయ్యే అవకాశాలు కొన్ని  ఉన్నాయి . మీరు వ్యాపారంలో, లేదా వృత్తిలో ఎదగడానికి మంచి అవకాశాలు పొందవచ్చు, కానీ మీ పూర్తి సామర్థ్యానికి మించి పని చేయడంతో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

మీన రాశి
మీన రాశి వ్యక్తులు వారి వృత్తి జీవితంలో వైఫల్యాలు, అనేక నిరాశలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని స్థాపించాలనుకునే వ్యక్తులు ఈ కాలంలో ఆ ఆలోచనకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి
శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం కర్కాటక రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో, సానుకూల ఫలితాలను పొందేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి పనిలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. అలాగే మీరు ఉద్యోగానికి రాజీనామా చేయవలసి ఉంటుంది, మీ మీద ఆఫీసులో, లేదా మీ పని ప్రదేశంలో కుట్రలు పన్నవచ్చు. 

కుంభ రాశి
కుంభ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. కార్యాలయంలో సహోద్యోగులు, సీనియర్ల నుండి ఎటువంటి మద్దతు ఉండదు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార భాగస్వాములతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. 

కన్యా రాశి
కన్యా రాశికి చెందిన ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది, ఆ  కారణంగా వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే వారు ఉద్యోగ బదిలీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారు ఉద్యోగస్తుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి, శని యొక్క ఈ మూమెంట్ వృత్తిపరమైన వృత్తికి హానికరం. వ్యాపార విస్తరణ భారీ నష్టాలను కలిగిస్తుందని అపజయం రాకుండా ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరమని అంటున్నారు.
Also Read: Shani Gochar 2023: కనివినీ ఎరుగుని రాజయోగం చేస్తున్న శని.. ఈరాశులకు చెప్పలేనంత మనీ..

Also Read: Saturn Transit 2023: శని గ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం, ఈ 5 రాశులకు లాటరీ తగిలేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News