Surya Gochar 2023: మార్చి 15న మీనరాశిలో సూర్యుడి గోచారం.. ఈ మూడు రాశులకు వరం..

Surya Gochar 2023 March: మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ఇది మూడు రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 03:42 PM IST
Surya Gochar 2023:  మార్చి 15న మీనరాశిలో సూర్యుడి గోచారం.. ఈ మూడు రాశులకు వరం..

Surya Gochar 2023 March:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడు ప్రతి రాశిలో నెల రోజులుపాటు ఉంటాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడి యెుక్క రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈనెల 15న సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. అంతేకాకుండా మీనంలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతుంది. సూర్యుడి యెుక్క సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం: వృషభ రాశి వారికి సూర్య సంచారం చాలా మేలు చేస్తుంది. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది.  కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఈసమయంలో పెట్టిన పెట్టుబడి మీకు మంచి రాబడిని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
మిథునం: సూర్యుని రాశిమార్పు మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త జాబ్ వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
కర్కాటకం: సూర్యుని రాశిలో మార్పు మరియు సూర్యుడు- బృహస్పతి కలయిక కూడా కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. 

Also Read: Shani uday 2023: హోలీ ముందు ఈ రాశులకు పట్టనున్న అదృష్టం... ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News