Sun transit 2024: శని రాశిలోకి సూర్యభగవానుడి ఆగమనం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Sun transit 2024: ప్రతి నెలా సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సంచరిస్తాడు. ఈరోజు ఆదిత్యుడు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 04:13 PM IST
Sun transit 2024: శని రాశిలోకి సూర్యభగవానుడి ఆగమనం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Surya Gochar 2024 in Kumbh: గ్రహాల కదలిక ప్రజల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గ్రహాల రాజు సూర్యభగవానుడు ఈరోజు (ఫిబ్రవరి 13) కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. శని రాశిలో భాస్కరుడు సంచారం కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. ఆదిత్యుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

కుంభ రాశి
ఇదే రాశిలో సూర్యుడి సంచారం వల్ల మీ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీరు ఆర్థికంగా పటిష్టమవుతారు. ఆగిపోయిన మీ పనులన్నీ వెనువెంటనే పూర్తవుతాయి. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
మేషరాశి
సూర్యుడి గమనంలో మార్పు మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో మీకు ప్రమోషన్ లభించడంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది. 
మిధునరాశి
మిథున రాశి వారికి సూర్య సంచారం శుభఫలితాలను ఇస్తుంది. మీ కెరీర్ లో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఫారిన్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. 

Also Read: Astrology: 30 రోజుల పాటు ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే... ఎందుకో తెలుసా..?

వృషభం
కుంభరాశిలో సూర్యుడు గోచారం వృషభరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయట పుడ్ తినడం మానుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Astrology: ఈ 5 రాశుల వారి ప్రేమ జీవితం ఫిబ్రవరి 14 నుంచి మస్త్ రొమాంటిక్.. సంబంధాలలో సాన్నిహిత్యం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News