Sun transit 2023: సూర్య గోచారంతో ఈ నాలుగు రాశులకు సెప్టెంబర్ 17 నుంచి అమితమైన లాభాలు

Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అందుకే ప్రతి గ్రహం కదలిక వివిధ రాశులపై వేర్వేరుగా ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2023, 06:57 AM IST
Sun transit 2023: సూర్య గోచారంతో ఈ నాలుగు రాశులకు సెప్టెంబర్ 17 నుంచి అమితమైన లాభాలు

Sun transit 2023: హిందూమత జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని యువరాజుగా, శని గ్రహాన్ని న్యాయదేవతగా, గురుడిని గురువుగా పిలుస్తుంటారు. గ్రహాల రారాజు సూర్యుడి కన్యా రాశి ప్రభావం సెప్టెంబ్ర 17 నుంచి ఈ 4 రాశులపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ నాలుగు రాశుల జాతకులు ఎక్కడికి చేరుకుంటారో పరిశీలిద్దాం.

సూర్యుడు అత్యంత శక్తివంతమైన గ్రహం. అందుకే గ్రహాలకు రారాజుగా ఉన్నాడు. సూర్యుడు సెప్టెంబర్ 17వ తేదీన సింహరాశిని వదిలి కన్యా రాశిలో గోచారం చేయనున్నాడు. సూర్యుడిని ఆత్మ, జీవితం, శక్తికి ప్రతీకగా భావిస్తున్నందున ఆ ప్రభావం అమితంగా ఉంటుంది. సూర్యుడి ఓ ప్రకాశవంతమైన గ్రహం కావడంతో ప్రతి మనిషిపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 7 గంటల 11 నిమిషాలకు సూర్యుడు..కన్యా రాశిలో రాశి పరివర్తనంతో ఈ నాలుగు రాశుల జీవితంలో కొత్త మలుపు రానుంది. అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. 

సూర్యుడు కన్యా రాశిలో గోచారం వల్ల వృశ్చిక రాశి జాతకులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. గత ఏడాది చేసిన శ్రమకు ఫలితాలు స్పష్టంగా కన్పిస్తాయి. పనిచేసే చోట అందరి సహకారంతో పాటు అందరి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, జీతం పెంపు కచ్చితంగా ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఫలితంగా ఈ రాశి జాతకులకు ఆర్ధికంగా ఎలాంటి సమస్యలుండవు. ప్రభుత్వపరమైన లావాదేవీల్లో ప్రయోజనాలుంటాయి. 

సూర్యుడి కన్యా రాశి ప్రవేశంతో మకర రాశి జాతకులకు అంతా శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆదివారం నాడు తప్పకుండా గుడికి వెళ్లి దానం చేయాలి. ఆర్ధికంగా లాభాలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అనువైన సమయం. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉండదు.

వృషభ రాశి జాతకులకు నెలరోజులు అంటే అక్టోబర్ 17 వరకూ అంతా అనుకూలమే. పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన సమయం. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. 

సూర్యుడి గోచారం ప్రభావం కర్కాటక రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. ఇంట్లో కుటుంబసభ్యులు ఏదైనా తీర్ధయాత్రకు వెళ్లవచ్చు. ఈ సమయంలో ఆదాయం బాగుంటుంది. అంటే వ్యాపారులు, ఉద్యోగులకు అనువైన సమయమిది. ఉద్యోగులు ఎప్పట్నించో ఎదురుచూస్తున్న పదోన్నతి లభిస్తుంది. ఈ రాశి జాతకులు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్దికంగా మంచి స్థితిలో ఉంటారు. 

Also read: Saturn Remedies: ప్రతి శనివారం ఈ 5 ఉపాయాలు పాటిస్తే మీరిక కోటీశ్వరులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News