Surya Gochar 2023: మిథునరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి!

Sun will Travel in Mithun Rashi Today:  నెలకొకసారి సూర్యుడు రాశిని మారుస్తాడు. ఈరోజు ఆదిత్యుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. భానుడు సంచారం వల్ల కొన్ని రాశులవారు నష్టాలను ఎదుర్కోనున్నారు. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2023, 07:06 PM IST
Surya Gochar 2023: మిథునరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి!

Sun will Travel in Mithun Rashi Today:   ఇవాళ గ్రహాల రాజు సూర్యుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. సూర్యుడి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశులకు అశుభకరంగా ఉంటుంది. జూన్ 15న సాయంత్రం 6.29 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించి జూలై 17 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. దీంతో ఈ సమయంలో నాలుగు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సూర్యుడి సంచారం ఈ రాశులకు నష్టదాయకం

వృషభం

మిథునరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ పుల్ గా ఉండాలి. దాంపత్య జీవితంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. 

కర్కాటక రాశి

ఆదిత్యుడి సంచారం కర్కాటక రాశి వారికి సమస్యలను పెంచుతుంది. శత్రువులు మీపై విజయం సాధిస్తారు. మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. విదేశాల్లో బిజినెస్ చేసేవారు ఇబ్బందులకు గురవుతారు. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 

వృశ్చిక రాశి

జూలై 17 వరకు వృశ్చిక రాశి వారి జీవితం గందరగోళానికి గురవుతుంది. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.  అంతేకాకుండా ఆఫీసులో మీ సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వదు. ఎక్కడా పెట్టుబడి పెట్టవద్దు. ప్రయాణాలు మానుకోండి. 

Also Read: Shukra Gochar 2023: జూలై 7న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు పండగే పండుగ..

మీనరాశి

మీన రాశి వారికి ఈ సమయం చాలా కష్టంగా ఉండబోతుంది. మీరు డబ్బు సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీరు ఏ పని చేపట్టినా అందులో సహచరుల సహకారం లభించదు. మీకు ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

Also Read: Shubh yog: 'మహాకేదార్ యోగం' చేయబోతున్న గ్రహాలు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News