Vivah Muhurat 2024: పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్న యువతకు బిగ్ షాక్.. మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..

Vivah Muhurat 2024: ప్రతి యేట వేసవి కాలంలో చైత్ర, వైశాఖం మాసాల్లో ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అంతేకాదు పిల్లలకు సెలవులు కూడా ఉండటంతో ఎక్కువ మంది పెళ్లిళ్లు ఈ సీజన్‌లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. కానీ ఈ సారి మాత్రం గురు, శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 23, 2024, 10:25 AM IST
Vivah Muhurat 2024: పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్న యువతకు బిగ్ షాక్.. మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..

Vivah Muhurat 2024: ఈ యేడాది పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్న యువతకు ఎక్కువ ముహూర్తాలు లేకపోవడం పెద్ద షాక్ అని చెప్పాలి.  హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రీరామనవమి సీతారామ కళ్యాణం తర్వాత కానీ పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కావు.  ఈ నెల ఏప్రిల్ 26న చివరి వివాహా ముహూర్తం ఉంది.  ఆ తర్వాత పెళ్లి ముహూర్తం కోసం దాదాపు 3 నెలల పాటు ఆగాల్సిందే అంటున్నారు పండితులు. ఈ సారి వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి చేసుకోవాల్సిన యువత మంచి ముహూర్తం కోసం మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే.  ఈ నెల 28న చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి మొదలు పెడితే.. 8-7-2024 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు రవితో శుక్రుడు మేషరాశిలో అస్తంగతం కావడం వల్ల ఈ కాలంలో  పెళ్లి ఇతర శుభకార్యాలకు పనికిరాదు. పెళ్లిల్లకు, దాంపత్య సుఖానికి గురు, శుక్ర బలం ఉండాల్సిందే. ఆయా గ్రహాలు రవి గ్రహంతో కలిస్తే అస్తంగతం అవుతుంది. ఇవి వివాహా, గృహ ప్రవేశ ఇతర శుభ  ముహూర్తాలకు పనికిరావు.

మరోవైపు గురు, రవితో వృషభ రాశిలో  కలవడం వల్ల ఏర్పడే గురు మూఢమి 7-5-2024న  చైత్ర బహుబళ చతుర్ధశి మంగళవారం నుంచి 7-6-2024 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురు మూఢమి ఉంటుంది. ఇది కూడా శుభ ముహూర్తాలకు పనికిరాదు. మరోవైపు ఆషాఢంలో దక్షిణాదిలో ఎలాంటి వివాహా శుభ ముహూర్తాలు ఉండవు.

మొత్తంగా శ్రావణ మాసం మొదలయ్యే పాడ్యమి 5-8-2024 నుంచి కొత్త ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో 7, 8, 9,10,11,13,15,17,18,20,22,23,24,27,28 మొత్తంగా 15 దాకా శుభ వివాహా ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ ఆశ్వీయుజం మాసం, కార్తీకంలో మంచి ముహూర్తాలున్నాయి.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News