BCCI Awards: హైదరాబాద్ వేదికగా బీసీసీఐ అవార్డుల వేడుక, హాజరుకానున్న స్టార్ ఆటగాళ్లు

BCCI Awards: తెలుగు గడ్డ హైదరాబాద్ వేదికగా బీసీసీఐ మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2024, 03:04 PM IST
BCCI Awards: హైదరాబాద్ వేదికగా బీసీసీఐ అవార్డుల వేడుక, హాజరుకానున్న స్టార్ ఆటగాళ్లు

BCCI Awards: దేశంలోని అత్యుత్తమ క్రికెటర్లకు బీసీసీఐ ప్రతియేటా అవార్డులు ఇస్తుంటుంది కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన కార్యక్రమం తిరిగి ఈ ఏడాది జనవరిలో జరగనుంది. ఈ వేడుకకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేశారు. 

బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్ దాదాపు మూడేళ్ల తరువాత తిరిగి జనవరి 23వ తేదీన జరగనుంది.హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకకు టీమ్ ఇండియా ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు. జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మొదటి టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ జట్టుని కూడా ఆహ్వానిస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శి ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఈ కార్యక్రమం గురించి లేఖ రాశారు. దేశంలోని అత్యుత్తమ క్రికెటర్ల సక్సెస్ స్టోరీల్ని గుర్తించి ఆ ఆటగాళ్లను గౌరవించే వేదిక బీసీసీఐ అవార్డుల కార్యక్రమమని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. బీసీసీఐ వార్షిక అవార్డులకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానముంటుందని చెప్పారు. క్రికెట్ హీరోల్ని అందించడంలో ఇప్పటి వరకూ అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. 

బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం చివరిసారిగా 2020 జనవరిలో ముంబై వేదికగా జరిగింది. 2018-19 క్రికెట్ ఏడాదికి అత్యుత్తమ ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చింది. పురుషుల జట్టులో జస్‌ప్రీత్ బూమ్రా,  మహిళల జట్టులో పూనమ్ యాదవ్‌లకు అవార్డు దక్కింది. మాజీ క్రికెటర్ సీకే నాయుడు పేరిట ఉన్న లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాకు అందింది. 

ఇంగ్లండ్‌తో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. పంజాబ్‌లోని మొహలిలో మొదటి టీ20,  జరగనుంది. 

Also read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు ‘స్పోర్ట్స్ హెర్నియా’.. స‌ర్జ‌రీ కోసం జర్మనీకి వెళ్లనున్న స్టార్ ప్లేయర్../p>

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link- https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News