Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పేరు ప్రకటన

Hardik Pandya Replaces Rohit Sharma As Captain Of MI: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 15, 2023, 07:10 PM IST
Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పేరు ప్రకటన

Hardik Pandya Replaces Rohit Sharma As Captain Of MI: ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కొత్త కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పేరును ప్రకటించింది. ముంబైకు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యహరించిన హార్ధిక్ పాండ్యా ఒకసారి ఛాంపియన్‌గా నిలపగా.. గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను కాదని.. పాండ్యాను ఎంపిక చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కెప్టెన్‌ బాధ్యతలను పాండ్యాకు అప్పగించడంతో హిట్‌మ్యాన్ ఇక బ్యాట్స్‌మెన్‌గా సేవలు అందించనున్నాడు. 

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహితశర్మ స్థానంలో పాండ్యాను ప్రకటించడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ముంబైకి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదనడం సరికాదని మండిపడుతున్నారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారని.. అతడు ఐపీఎల్ నుంచి తప్పుకునే వరకూ కొనసాగించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌తోనే ఐపీఎల్ ప్రస్థానం మొదలు పెట్టాడు. అయితే 2022 సీజన్‌కు ముందు పాండ్యాను ముంబై జట్టు వదులుకుంది. గుజరాత్ జట్టు హార్ధిక్‌ను తీసుకుని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆడిన తొలి సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించి పాండ్యా సూపర్ కెప్టెన్‌గా మారిపోయాడు. 2023 సీజన్‌లోనూ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్ పోరు చెన్నై జట్టు చేతిలో ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది. ఇక వచ్చే సీజన్‌కు ముందు ఇటీవల ఆటగాళ్ల ట్రెడింగ్‌లో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్ తిరిగి జట్టులోకి తీసుకుంది. తాజాగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

"ఇది జట్టు నిర్మాణంలో భాగం. భవిష్యత్ కోసం సిద్ధంగా ఉండాలనే ముంబై ఇండియన్స్ తత్వానికి కట్టుబడి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఎల్లప్పుడూ సచిన్ నుంచి హర్భజన్ వరకు.. రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ వరకు అద్భుతమైన కెప్టెన్లను కలిగి ఉంది. వారు జట్టును విజయపథంలో నడిపించడంతోపాటు.. భవిష్యత్‌ కోసం జట్టును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ ఫిలాసఫీకి అనుగుణంగానే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు" అని ముంబై ఇండియన్స్  గ్లోబల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హెడ్ మహేల జయవర్ధనే అన్నారు. రోహిత్ శర్మ అసాధారణ నాయకత్వానికి జట్టు కృతజ్ఞతలు తెలుపుతోందని.. 2013 నుంచి ముంబై ఇండియన్స్‌ను విజయం పథంలో నడిపించాడని కొనియాడారు. ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అని చెప్పారు.
 
ముంబై ఇండియన్స్ జట్టుకు హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 87 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 67 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 4 మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ముంబైకు ఐదు టైటిళ్లు అందించి.. ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వకుంగా ఇలా అర్ధాంతరంగా కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడం సరికాదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read:  Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News