IND vs AUS 2nd T20I Updates: రేపే ఆసీస్‌తో రెండో టీ20.. పిచ్ ఎవరికి అనుకూలం..? తుది జట్టులో ఎవరు ఉంటారు..?

India Vs Australia playing 11 and Pitch Report: భారత్, ఆసీస్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం రెండో టీ20 జరగనుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? తుది జట్లు ఎలా ఉంటాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి.. వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 08:00 PM IST
IND vs AUS 2nd T20I Updates: రేపే ఆసీస్‌తో రెండో టీ20.. పిచ్ ఎవరికి అనుకూలం..? తుది జట్టులో ఎవరు ఉంటారు..?

India Vs Australia playing 11 and Pitch Report: తొలి టీ20లో ఆసీస్‌ను 2 వికెట్లతో తేడాతో ఓడించిన భారత్.. రెండో టీ20 పోరుకు సిద్ధమైంది. విశాఖ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 208 పరుగుల భారీ స్కోరు చేసినా.. టీమిండియా ఛేదించింది. వరల్డ్ కప్‌ ఓటమి బాధలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కు ఈ గెలుపు కొంచెం ఊరటనిచ్చింది. ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి సిరీస్‌లో ముందడుగు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే ఫామ్‌లో ఉండగా.. ఇషాన్ కిషన్ మంచి టచ్‌లో ఉన్నాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ గాడినపడాలి. తిలక్ వర్మ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు అభిమానులు. బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రెండో టీ20లో విజయం సాధించి.. గెలుపు బాట పట్టాలని కంగారూలు చూస్తున్నారు. రెండో టీ20 మ్యాచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..

వేదిక ఎక్కడ..?

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు IND Vs AUS రెండో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఎక్కడ చూడాలి..?

Sports18 నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేస్తుంది. మ్యాచ్ డీడీ ఫ్రీ డిష్‌లో కూడా ప్రసారం అవుతుంది. జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.

పిచ్ రిపోర్ట్ ఇలా..

గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఎక్కువగా బౌలింగ్‌కు సహకరిస్తుంది. ఇక్కడ లోస్కోరింగ్ గేమ్‌లే ఎక్కువగా జరిగాయి. ఈ స్టేడియంలో జరిగిన మూడు టీ20ల్లో సగటు స్కోరు 114 పరుగులు మాత్రమే. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 

వెదర్ రిపోర్ట్ ఇలా.. 

ఆదివారం తిరువనంతపురంలో 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నా.. మ్యాచ్ రోజున వాతావరణం స్పష్టంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తుది జట్లు ఇలా (అంచనా)

భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News