IND vs NZ Uppal Stadium Tickets: ఉప్పల్‌ స్టేడియంలో వన్డే మ్యాచ్‌.. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం! పూర్తి వివరాలు ఇవే

IND vs NZ 2023 Uppal Stadium Tickets available only on Paytm. జనవరి 13 నుంచి ఆన్‌లైన్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే టికెట్ల అమ్మకాలు మొదలవుతాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్‌ తెలిపారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 11, 2023, 08:19 PM IST
  • ఉప్పల్‌ స్టేడియంలో వన్డే మ్యాచ్‌
  • ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం
  • పూర్తి వివరాలు ఇవే
IND vs NZ Uppal Stadium Tickets: ఉప్పల్‌ స్టేడియంలో వన్డే మ్యాచ్‌.. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం! పూర్తి వివరాలు ఇవే

India vs New Zealand 1st ODI Uppal Stadium Tickets Sale Starts from January 13: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఉప్పల్‌ స్టేడియం త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2023 జనవరి 18న భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్‌ స్పష్టం చేశారు. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఆయన వెల్లడించారు.  

జనవరి 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు మొదలవుతాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో పేటీఎంలో మాత్రమే మ్యాచ్ టికెట్స్ విక్రయిస్తామని  ఆయన స్పష్టం చేశారు. ఆఫ్‌లైన్‌ టికెట్లు అమ్మడం లేదని అజహరుద్దీన్‌ చెప్పారు. ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో జనవరి 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్‌ టికెట్లు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతోంది.

గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు మొహ్మద్ అజహరుద్దీన్‌ చెప్పారు. ఉప్పల్‌ స్టేడియం కెపాసిటీ 39,112 కాగా.. అందులో 9695 కాంప్లిమెంటరీ పాసెస్ ఉన్నాయి. మిగతా 29,417 టికెట్స్ ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచుతారు. టికెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తామని అజహరుద్దీన్‌ చెప్పుకొచ్చారు.

2023 జనవరి 14న న్యూజిలాండ్‌ జట్టు హైదరాబాద్ నగరానికి వచ్చి.. 15న ప్రాక్టీసు చేస్తుంది. మరోవైపు భారత జట్టు జనవరి 16న హైదరాబాద్‌ చేరుకుంటుంది. 17న ఇరు జట్లు ప్రాక్టీస్‌ చేస్తాయి. 18న మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. 21న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, 24న ఇండోర్‌లో మూడో వన్డే జరుగుతుంది. జనవరి 27న రాంచీలో తొలి టీ20, 29న లక్నోలో రెండో టీ20, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 1న మూడో టీ20 జరగనుంది.  

Also Read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే  

Also Read: Saturn Transit 2023: శతభిషా నక్షత్రంలోకి శని గ్రహం.. ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News