MI vs LSG, IPL 2022: కేఎల్ రాహుల్ సెంచరీ, మళ్లీ ఓడిన ముంబయి ఇండియన్స్

IPL 2022: ఐపీఎల్ లో ముంబయికి విజయం ఇప్పట్లో దక్కేలా లేదు. తాజాగా ఆరో మ్యాచ్ లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. శనివారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 08:45 PM IST
MI vs LSG, IPL 2022: కేఎల్ రాహుల్ సెంచరీ, మళ్లీ ఓడిన ముంబయి ఇండియన్స్

MI vs LSG Highlights, IPL 2022:  ఐపీఎల్ (IPL 2022)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) రాత మారేలా కనిపించట్లేదు. ఆ జట్టు వరుస పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. శనివారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచులో 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 

మెుదట బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ (Lucknow Super Giants) 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి ముందు ఉంచింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (103*) సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ (6) మరోసారి నిరాశ పరిచాడు. బ్రెవిస్ (31), సూర్యకుమార్ (37), తిలక్ వర్మ (26) రాణించారు. చివర్లో పొలార్డ్ (25), ఉనద్కత్ (14) పోరాడిన మంబయికి విజయాన్ని అందించలేకపోయారు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3 వికెట్లు తీసి రోహిత్ సేన్ వెన్ను విరిచాడు. హోల్డర్‌, బిష్ణోయ్‌, స్టెయినిస్‌, చమీరా తలో వికెట్ పడగొట్టారు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది లఖ్‌నవూ. కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకంతో కదం తొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38), క్వింటన్ డికాక్ (24) ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ చెరో వికెట్ తీశారు.

Also Read: IPL Catches Record: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 వికెట్ కీపర్లు వీళ్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News