IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా

IPL 2024 DC vs SRH: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ కీలక పోరు ఇవాళ జరగనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్లు ప్లేయింగ్ 11, జట్ల బలాబలాల గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2024, 09:07 AM IST
IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా

IPL 2024 DC vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ప్రపంచ రికార్డులు అలవోకగా బద్దలవుతున్నాయి. పరుగులు సునామీ కన్పిస్తోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. 

ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌తో విరుచుకుపడుతూ అత్యధిక పరుగుల రికార్డు సృష్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న ఢిల్లీ కేపిటల్స్..ఎస్ఆర్‌హెచ్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఇదే సీజన్‌లో రెండు సార్లు అత్యధిక స్కోర్లు 277, 287 పరుగులు చేసిన ఆరెంజ్ ఆర్మీ ఐదో విజయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 

ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, మార్క‌రమ్, అబ్దుల్ సమద్‌ల బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉందో ఈ సీజన్‌లో అందరికీ తెలిసిందే. ప్యాట్ కమిన్స్ అద్భుతమైన కెప్టెన్సీ ప్రతి మ్యాచ్‌లో కన్పిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో మార్పులు చేస్తున్న ప్యాట్ కమిన్స్ ఈసారి ఎలాంటి మార్పులు చేయనున్నాడో చూడాలి. షాబాజ్ అహ్మద్‌ను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చే పరిస్థితి కన్పిస్తోంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకూకూ 23 సార్లు తలపడ్డాయి. ఇందులో 12 సార్లు ఎస్ఆర్‌హెచ్, 11 సార్లు డిల్లీ కేపిటల్స్ విజయం సాధించాయి. గత సీజన్లలో మూడు మ్యాచ్‌లు మాత్రం ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌లు గెలిచింది. నాలుగింట ఓటమిపాలైంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా

ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మయాంక్ మార్కండే ఉండవచ్చు.

ఢిల్లీ కేపిటల్స్ ప్లేయింగ్ 11 అంచనా

పృధ్వి షా, జేక్ ఫ్రేజర్, స్టబ్స్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, సుమీత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్

Also read: IPL 2024: ఐపీఎల్ లో సిక్సర్లు మోత మోగిస్తున్న తెలుగోడు.. 21 ఏళ్లకే అరుదైన రికార్డు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News