Hardik Pandya: తర్వాత మ్యాచ్ అయినా గెలిపించు స్వామి.. శివయ్యను వేడుకున్న హార్దిక్ పాండ్యా.. వైరల్ అవుతున్న వీడియో..

Hardik Pandya: ఏప్రిల్ 07న ముంబై ఇండియన్స్, ఢిల్లీ మధ్య కీలకపోరు జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లోనైనా గెలిచేలా చూడమని శివయ్యకు మెురపెట్టుకున్నాడు హార్దిక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 6, 2024, 01:06 PM IST
Hardik Pandya: తర్వాత మ్యాచ్ అయినా గెలిపించు స్వామి.. శివయ్యను వేడుకున్న హార్దిక్ పాండ్యా.. వైరల్ అవుతున్న వీడియో..

Hardik Pandya Video viral: వరుస ఓటములతో డీలా పడిపోయిన ముంబై ఇండియన్స్ ను ఈ సారైనా విజయం వరించాలని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుళ్లు చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా ముంబై సారథి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని  దర్శించి శివయ్య పూజలు చేశాడు. ఆలయంలో హార్దిక్ ప్రార్థనలు చేస్తున్న వీడియోను సోమనాథ్ ఆలయ ట్రస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాకముందే ముంబై జట్టులో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి రావడం, కెప్టెన్ గా రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ముంబై ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. తీరా సారథి బాధ్యతలు చేపట్టాక పాండ్యా వెలగబెట్టింది ఏమైనా ఉందా అంటే అది లేదు. అతడు వ్యక్తిగతంగా విఫలమవ్వడమే కాకుండా.. జట్టును కూడా గెలుపుబాట పట్టించలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యుచుల్లో ముంబై ఓడిపోయింది. దీంతో తర్వాత మ్యాచ్ ఎలాగైనా గెలవాలని హార్దిక్ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ముంబై ఇండియన్స్ తన తర్వాత మ్యాచ్ ను ఢిల్లీతో ఏప్రిల్ 07న ఆడబోతుంది. 

సూర్య రాకతో విజయాల బాట పట్టేనా!

ఇన్నాళ్లు జట్టుకు దూరమైన టీ20కా బాప్ సూర్యకుమార్ యాదవ్ తిరిగిరావడం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం. గాయం కారణంగా జట్టుకు దూరమైన సూర్యా భాయ్ రీసెంట్ గా జాతీయ క్రికెట్ అకాడమీ ఫిటినెస్ క్లియరెన్స్ ఇవ్వడంతో ముంబై తర్వాత ఆడబోయే మ్యాచ్ లో ఆడనున్నాడు. మరోవైపు తర్వాత రెండు మ్యాచుల్లో కూడా ముంబై ఓడిపోతే కెప్టెన్ గా పాండ్యాను తప్పించి.. ఆ బాధ్యతలు రోహిత్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై టీమ్ అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనే ఓడిపోయిన ముంబై నెట్ రన్ రేట్ -1.423తో చివరి స్థానంలో నిలిచింది.  

Also Read: RR VS RCB Match: బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రేపే.. ఇరు జట్ల బలబలాలు, ఫ్లేయింగ్ 11 ఇదే..!

ముంబై జట్టు:
రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధహ్ చావ్లా జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ మరియు శివలిక్ శర్మ.

Also Read: Shocking news: ముంబైను వీడనున్న రోహిత్.. హిట్ మ్యాన్ బాటలోనే మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News