IPL 2024 Points Table: లెక్కేసి కొడుతున్న రాజస్థాన్... దెబ్బకు దిగజారిన KKR స్థానం..

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ లో జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. టీమ్స్ అన్నీ నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. తొలి స్థానంలో ఎవరున్నారు, చివరి ఫ్లేస్ లో ఏ జట్టు ఉందో తెలుసుకోండి   

Written by - Samala Srinivas | Last Updated : Apr 7, 2024, 02:14 PM IST
IPL 2024 Points Table: లెక్కేసి కొడుతున్న రాజస్థాన్... దెబ్బకు దిగజారిన KKR స్థానం..

IPL 2024 Points Table Updates: ఐపీఎల్ సీజన్-17లో 18 మ్యాచ్‌లు ముగిశాయి.ఆర్సీబీ, రాజస్థాన్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడిన నాలుగు మ్యాచుల్లో నెగ్గి టాప్ ఫ్లేస్ దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. ఆ జట్టు 8 పాయింట్లతో +1.120 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఐపీఎల్‌లో  హ్యాట్రిక్ విజయాలు సాధించిన మరో టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 6 పాయింట్లుతో +2.518 నెట్ రన్ రేట్ కలిగి సెకండ్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. 
మారని చెన్నై స్థానం..
ఇక రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయి +0.517 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆ జట్టు ఆడిన 3 మ్యాచ్‌లలో 2  గెలిచి +0.483 రన్ రేట్ తో నాలుగు పాయింట్ల సాధించింది. 

ఐదో ర్యాంకును నిలబెట్టుకున్న సన్ రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. కమిన్ జట్టు +0.409 రన్ రేట్ ను కలిగి ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి -0.220 రన్ రేట్ తో ఆరో స్తానంలో నిలిచింది ఆ జట్టు నాలుగు పాయింట్లు సాధించింది. గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు నాలుగు పాయింట్లతో ఏడో ర్యాంకును దక్కించుకుంది. ఆ జట్టు -0.580 రన్ రేట్ తో కొనసాగుతోంది.

ఇంకా అట్టడుగునే ముంబై..
నిన్నటి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఐదు మ్యాచులు ఆడిన ఆ జట్టు నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి రెండు పాయింట్లతో -0.843 నికర రన్ రేట్ ను కలిగి ఉంది. నాలుగు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ -1.347తో 2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిపోయి -1.423 రన్ రేట్ ను కలిగి ఉంది. 

Also Read: RR vs RCB Highlights: సిక్స్ తో బట్లర్ సెంచరీ...ఆర్సీబీపై రాజస్థాన్ సూపర్ విక్టరీ..

Also  Read: Hardik Pandya: తర్వాత మ్యాచ్ అయినా గెలిపించు స్వామి.. శివయ్యను వేడుకున్న హార్దిక్ పాండ్యా.. వైరల్ అవుతున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News