DC vs RR Live Score : పిచ్చకొట్టుడు కొట్టిన పరాగ్.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..

DC vs RR Live : హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్స్ బ్యాటర్లు రాజసం ప్రదర్శించారు. తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రియాన్ పరాగ్ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 28, 2024, 09:59 PM IST
DC vs RR Live Score : పిచ్చకొట్టుడు కొట్టిన పరాగ్.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..

IPL 2024, DC vs RR Live Score:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శాంసన్ సేన నిర్ణీత  20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84) మరోసారి గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి అశ్విన్(29), జురెల్(20) సహకారమందించారు. 

సొంత గ్రౌండ్ లో రాజస్థాన్ అదరగొట్టింది. మెుదట తడబడిన చివర్లో పుంజుకుని మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాయల్స్ ఓపెనర్లు జైస్వాల్(5), బట్లర్(11) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ శాంసన్ , రియాన్ పరాగ్ ఆదుకున్నారు. పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరోవైపు సంజూ కేవలం 15 పరుగులే చేసి ఔటయ్యాడు. 

క్రీజులోకి వచ్చిన అశ్విన్ అండగా పరాగ్ చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. మరోవైపు యష్ కూడా బ్యాట్ ఝలిపించాడు. కేవలం 19 బంతుల్లో మూడు సిక్సర్లుతో 29 పరుగుల చేసి ఔటయ్యాడు. అనంతరం జురెల్ తో కలిసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు పరాగ్. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇంకోవైపు జురెల్ 12 బంతుల్లో మూడు ఫోర్లుతో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో హిట్మెయిర్ ఫోర్, సిక్సర్ తో 14 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్న పరాగ్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లుతో 84 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, ఖలీల్ ఆహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేసి చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చారు. 

Also Read: Hardik Pandya: రెండు మ్యాచ్‌లతోనే జీరోగా మారిన హార్దిక్ పాండ్యా చేసిన తప్పులేంటి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్

Also Read: Sunrisers Hyderabad: ఒక్క మ్యాచ్ తో టాప్-3లోకి దూసుకొచ్చిన సన్ రైజర్స్.. ఫస్ట్ ఫ్లేస్ ఎవరిదంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News