RR vs LSG Live Score: టాస్ ఓడిపోయిన కేఎల్ రాహుల్... బ్యాటింగ్ ఎవరిదంటే?

RR vs LSG Live Score: లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇరు జట్ల ప్లేయింగ్ XI గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 24, 2024, 03:57 PM IST
RR vs LSG Live Score: టాస్ ఓడిపోయిన కేఎల్ రాహుల్... బ్యాటింగ్ ఎవరిదంటే?

IPL 2024 RR vs LSG LIve Score:  మరికొన్ని క్షణాల్లో జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals), లక్నో సూపర్‌ జెయింట్స్‌(Lucknow Supergiants) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌(,Sanju samson) బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇది ఈ సీజన్ లో నాలుగో మ్యాచ్.

స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే మ్యాచ్ కు ముందు ఇరు జట్ల కీలక పేసర్లు దూరమయ్యారు. రాజస్థాన్ ప్రసిద్ కృష్ణను, లక్నో  మార్క్ వుడ్ ను సేవలను కోల్పోయాయి. బ్యాటింగ్ పరంగా లక్నో, బౌలింగ్ పరంగా రాజస్థాన్ బలంగా ఉన్నాయి. మరి ఈపోరులో ఎవరో విజేతగా నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):  కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

వెదర్ రిపోర్టు
ఆదివారం జైపూర్‌లో 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. 

Also Read: RR vs LSG Dream11 Prediction: మరికాసేపట్లో రాజస్థాన్ vs లక్నో మ్యాచ్.. ప్లేయింగ్‌ 11 ఇదే..!  

Also Read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News