RR vs LSG Live Score : శాంసన్, పరాగ్ మెరుపులు.. లక్నో ముందు భారీ లక్ష్యం..

IPL 2024 Live Updates: లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ సంజూ శాంసన్ మెరుపులకు పరాగ్ కూడా తోడవ్వడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2024, 06:06 PM IST
RR vs LSG Live Score : శాంసన్, పరాగ్ మెరుపులు.. లక్నో ముందు భారీ లక్ష్యం..

Rajasthan Royals vs Lucknow Super Giants Match LIve Score:  జైపూర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. సంజూ శాంసన్, రియాన్ పరాగ్ మెరుపులతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్-హక్ రెండు వికెట్లు తీశాడు. 

తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా జైస్వాల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. మరోవైపు బట్లర్ కేవలం 11 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు ఫోర్లు, సిక్సర్ తో 24 పరుగుల చేసిన జైస్వాల్ కూడా కాసేపటికే పెవిలియన్ చేరాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఆచిచూతి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ముఖ్యంగా శాంసన్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఫోర్లు, సిక్సర్లుతో విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నవీన్ విడదీశాడు. 43 పరుగుల చేసిన పరాగ్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన హిట్ మెయిర్ కూడా ఐదు పరుగులకే ఔటయ్యాడు. శాంసన్ మెరుపులకు చివరిలో ధ్రువ్ జురెల్ కూడా తోడవ్వడంతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 52 బంతుల్లో ఆరు సిక్సులు, మూడు ఫోర్లుతో 82 పరుగులు చేసిన శాంసన్ నాటౌట్ గా నిలిచాడు. 

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు:  కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

Also Read: Nitish Rana: రెచ్చగొడితే రచ్చరచ్చే.. ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన బౌలర్‌కు భారీ జరిమానా

Also Read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News