IPL 2024 SRH List: భారమైన ఆటగాళ్లను వదిలించుకున్న ఎస్ఆర్‌హెచ్, బ్రూక్‌కు గుడ్ బై

IPL 2024 SRH List: ఐపీఎల్ 2024 మెగా వేలంలో కీలక ప్రక్రియ ముగిసింది. వివిధ ఫ్రాంచైజీలు రిటైన్ అండ్ రిలీజ్ జాబితాలు ప్రకటించాయి. ఈసారి దాదాపు అన్ని జట్లు పెద్దఎత్తున ఆటగాళ్లను వదిలించుకునే నిర్ణయమే తీసుకున్నట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 26, 2023, 08:41 PM IST
IPL 2024 SRH List: భారమైన ఆటగాళ్లను వదిలించుకున్న ఎస్ఆర్‌హెచ్, బ్రూక్‌కు గుడ్ బై

IPL 2024 SRH List: ఐపీఎల్ 2024 వేలం వచ్చే నెల అంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. వేలం కంటే ముందు కీలకమైన రిటెన్షన్ జాబితాలు వెల్లడయ్యాయి. ఇక మిగిలింది ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది చూసుకుని వేలంలో పాడుకునేందుకు సిద్ధం కావడమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి ఖరీదైన ఆటగాళ్లను వదిలించుకుంది. 

ఐపీెల్ 2023లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి గట్టి నిర్ణయం తీసుకున్నట్టే కన్పిస్తోంది. రెండు పేర్లతో రెండు సార్లు టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాల్సిందేనని కావ్య పాప డిసైడ్ అయిపోయినట్టుంది. అందుకే గతంలో చేసిన తప్పులు ఈసారి చేయకూడదనుకుంది. జట్టుకు భారంగా బారిన ఆటగాళ్లను వదిలించుకోవడం ద్వారా వ్యాలెట్ పెంచుకుని, వేలంగా స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమౌతోంది. అందుకే ఐపీఎల్ 16 లో విఫలమైన ఆటగాళ్లను వదిలించేసుకుంది. గత సీజన్‌లో అత్యధిక ధర చెల్లించి ఎస్ఆర్‌హెచ్ జట్టు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఆ జట్టుకు చాలా భారంగా మారాడు. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. 13.25 కోట్లకు ఇది ఏ మాత్రం సరితూగని ప్రదర్శనే.

అదే విధంగా మరికొందరు ఖరీదైన ఆటగాళ్లు వివ్రాంత్ శర్మ, ఆదిల్ రషీద్ తదితరుల్ని వదులుకుంది. ఆర్సీబీకు చెందిన షాబాద్ నదీమ్‌ను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకుని..మయాంగ్ డాగర్‌ను ఆ జట్టుకు ఇచ్చేసింది. వచ్చే సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 18 మంది ఆటగాళ్లను మాత్రం ఉంచుకుంది. మిగిలినవారిని రిలీజ్ చేసేసింది.

ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ లిస్ట్

హ్యారీ బ్రూక్, సమర్ధ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్

ఎస్‌ఆర్‌హెచ్ రిటెన్షన్ లిస్ట్

వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, సంవీర్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఐడెన్ మార్క్ రమ్, గ్లెన్ ఫిలిప్, ఫజలుల్ హక్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్

Also read: RCB Retain List: వ్యాలెట్ పెరగాలంటే వేటు తప్పదు, 11 మందిని వదిలించుకున్న ఆర్సీబీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News