Rishabh Pant: బుద్ధి మారని పంత్.. మరోసారి అలా చేస్తే అతడిపై వేటు పక్కా..

IPL 2024: ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో ఓడిపోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. నిన్న కేకేఆర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందు ఆ జట్టుపై మరో బాంబ్ పడింది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 4, 2024, 08:57 PM IST
Rishabh Pant: బుద్ధి మారని పంత్.. మరోసారి అలా చేస్తే అతడిపై వేటు పక్కా..

Rishabh Pant in Danger: ఐపీఎల్ 17వ ఎడిషన్ లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైజాగ్ వేదికగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అయ్యర్ సేన అద్భుత విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 272 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది. దీంతో కేకేఆర్ 106 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. 

దెబ్బ మీద దెబ్బ..
మరోవైపు ఓటమి బాధలో ఉన్న ఢిల్లీకు మరో దెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఫ్లేయింగ్ 11లో ఆడిన ఒక్కొక్క ఆటగాడికి రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బౌలింగ్ చేసింది పంత్ సేన. అయితే ఆ జట్టు నిర్ణీత సమయంలోగా బౌలింగ్ ను కంప్లీట్ చేయలేకపోయింది. ఈ కారణంగా ఆ జట్టుకు ఫైన్ విధించారు.

పంత్ మరోసారి ఇలా చేస్తే..
ఐపీఎల్ రూల్స్ ప్రకారం, ప్రతి టీమ్ 20 ఓవర్లను గంటన్నరలో పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకుంటే ఫీల్డర్ ను బౌండరీ లైన్ నుంచి తొలగించడం జరుగుతుంది. అలాగే ఈ తప్పు చేసిన జట్టు సారథికి రూ.10 లక్షల ఫైన్ విధిస్తారు. అదే తప్పును రెండో సారి కూడా చేస్తే ఆ టీమ్ కెప్టెన్ కు రూ. 24 లక్షలు జరిమానా విధించడం జరుగుతుంది. తుది జట్టులోని పది మంది ఆటగాళ్లపై  6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. మూడోసారి కూడా రిపీట్ అయితే జట్టు కెప్టెన్‌కు 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. జట్టులోని మిగతా సభ్యులకు ఒక్కొక్కరికి రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ వేస్తారు.

Also Read: IPL 2024 Updates: ఊపిరి పీల్చుకో ముంబై.. టీ20కా బాప్ వచ్చేస్తున్నాడు..!

రిషభ్ ఇప్పటికే ఆ తప్పును రెండు సార్లు చేశాడు. సీఎస్కే మ్యాచ్ సందర్భంగా ఒకసారి, నిన్న కేకేఆర్ తో మరోసారి అదే తప్పును పునారావృతం చేశాడు. మరోసారి ఇలా జరిగితే అతడిపై మ్యాచ నిషేధం విధిస్తారు. ఇకనైనా ఈ ఢిల్లీ కెప్టెన్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. 

Also Read: KKR Batter: డెబ్యూ మ్యాచ్‌లోనే ఊచకోత కోశాడు.. అసలు ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News