IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో

IPL 2022 Points Table List. తాజా విజయంతో లక్నో సూపర్ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చింది. టోర్నీలో బోణి కొట్టని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 12:32 PM IST
  • ఐదో స్థానంలో లక్నో
  • అట్టడుగు స్థానంలో హైదరాబాద్
  • ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఇషాన్‌
IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో

IPL 2022 Points Table, Purple Cap and Orange Cap Holder List: ఐపీఎల్‌ 2022 రసవత్తరంగా సాగుతోంది. కొన్ని జట్లు వరుస విజయాలు అందుకుంటుంటే.. మరికొన్ని జట్లు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాయి. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టుతో తలపడిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో మెగా టోర్నీలో లక్నో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు లక్ష్యానికి చేరువగా వచ్చి చివర్లో ఓటమిపాలైన హైద్రాబాద్‌ టోర్నీలో రెండో పరజాయాన్ని చవిచూసింది.

తాజా విజయంతో లక్నో సూపర్ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చింది. మూడు మ్యాచ్‌లు ఆడిన లక్నో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. టోర్నీలో బోణి కొట్టని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన రాజస్థాన్‌ రాయల్స్‌ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 2 విజయాలు, ఒక పరాజయంతో రెండవ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట్సల్‌ టాప్-5లో ఉన్నాయి. 

టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి వద్ద ఉండే ఆరెంజ్‌ క్యాప్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌ దగ్గర ఉంది. ఇషాన్‌ రెండు మ్యాచ్‌ల్లో 135 పరుగులు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన జోస్ బట్లర్‌ (135) రెండో ప్లేసులో ఉండగా.. లక్నో బ్యాటర్‌ దీపక్‌ హుడా (119) మూడో స్థానానికి చేరుకున్నాడు. చెన్నైకి చెందిన శివమ్ దూబే (109) నాలుగో స్థానంలో ఉండగా.. లక్నో సారథి కేఎల్ రాహుల్‌ (108) ఐదో ప్లేసులో ఉన్నాడు.

ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు అందించే పర్పుల్‌ క్యాప్‌.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ వద్ద ఉంది. ఉమేష్ ఇప్పటివరకు 8 వికెట్లు పడగొట్టాడు. లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ 7 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. రాహుల్‌ చహర్‌ (6) మూడో స్థానంలో ఉన్నాడు. 5 వికెట్లతో యుజువేంద్ర చహల్‌ నాలుగో స్థానంలో ఉండగా..అదే  5 వికెట్లతో మహ్మద్ షమీ ఐదో స్థానంలో ఉన్నాడు.

Also Read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!

Also Read: Rajamouli Dance: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు రాజమౌళి స్టెప్పులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News