IPL 2022 SRH Jersey: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాళ్లు.. కొంపదీసి స్విగ్గీ డెలివరీ చేసుకుంటారా ఏంది?

Trolls on SRH New Jersey: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నయా జెర్సీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో.. ఫాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేయడం విశేషం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 09:40 PM IST
  • కొత్త జెర్సీని విడుదల చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌
  • స్విగ్గీ డెలివరీ చేసుకుంటారా మాస్టారూ
  • విదేశాల్లో ఖైదీలకు వేసే జెర్సీ లాగ ఉంది
IPL 2022 SRH Jersey: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాళ్లు.. కొంపదీసి స్విగ్గీ డెలివరీ చేసుకుంటారా ఏంది?

Fans trolls SRH New Jersey for IPL 2022: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం ఆసన్నమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం మరో రెండు రోజుల్లో జరగనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్న ఈ వేలంలో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలు పాల్గొననున్నాయి. వేలం కోసం అన్ని ప్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆడుతాడో అని అభిమానుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. 

ఐపీఎల్ 2022 నేపథ్యంలో తెలుగు జట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) కొత్త జెర్సీని బుధవారం సాయత్రం విడుదల చేసింది. 'ప్రెసెంటింగ్ అవర్ న్యూ జెర్సీ' అని ఎస్‌ఆర్‌హెచ్‌ ట్వీట్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ కొత్త జెర్సీ నారింజ‌, న‌లుపు రంగుల‌తో ఉంది. జెర్సీపై ఎక్కువ నారింజ రంగే కనబడుతోంది. కాల‌ర్‌, మెడ‌, హ్యాండ్ భాగంలో మాత్ర‌మే న‌లుపు రంగు ఉంది. ఇక ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్ల కొత్త ప్యాంట్‌ మొత్తం నారింజ రంగులోనే ఉంది. నిజానికి కొత్త జెర్సీ కంటే.. పాత జెర్సీనే బాగుంది. 

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నయా జెర్సీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో.. ఫాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేయడం విశేషం. 'స్విగ్గీ డెలివరీ చేసుకుంటారా మాస్టారూ' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'విదేశాల్లో ఖైదీలకు వేసే జెర్సీ లాగ ఉంది' అని ఇంకొకరు ట్వీటారు. 'పెర్త్ స్కార్చర్స్ జెర్సీని ఎస్‌ఆర్‌హెచ్‌ కాపీ కొట్టింది.  '2016 జెర్సీ బాగుంది', 'ప్రాక్టీస్ సెషన్‌ జెర్సీనే బాగుంది కదా', 'అధికారిక స్పాన్సర్ మిరాండా లేదా ఫాంటా' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. 

ఐపీఎల్‌ 2021లో సన్‌రైజర్స్‌ హైద‌రాబాద్ చెత్త ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. 14 లీగ్ మ్యాచ్‌లకు గానూ కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటు కల్పించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక ఐపీఎల్ 2022 కోసం కేన్‌ విలియమ్సన్‌ (14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (4 కోట్లు), ఉమ్రాన్‌ మలిక్‌ (4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ 2022 వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకునే ప్రణాళికలో ఉందని సమాచారం. 

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ హెడ్‌ కోచ్‌గా టామ్ మూడీనే కొనసాగాడు. మిగ‌తా స‌పోర్టింగ్‌లో మాత్రంలో కీల‌క మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా బ్యాటింగ్ కోచ్‌గా, స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేస్‌ బౌలింగ్ కోచ్‌గా, భారత మాజీ బ్యాటర్ హేమన్ బదానీ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక‌య్యాడు. ఇక శ్రీ‌లంక స్పిన్ దిగ్గ‌జం ముత్తయ్య మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.

Also Read: Viral Video: సీఎం యోగి వేషధారణలో పోలింగ్‌బూత్‌కు కోహ్లీ.. సెల్పీలు దిగిన ఫాన్స్! చివరకు ట్విస్ట్!!

Also Read; Viral Video: సీఎం యోగి వేషధారణలో పోలింగ్‌బూత్‌కు కోహ్లీ.. సెల్పీలు దిగిన ఫాన్స్! చివరకు ట్విస్ట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News