Sara Tendulkar: ఆ ఫొటోలపై స్పందించిన సారా టెండూల్కర్.. నాకు అసలు అకౌంటే లేదంటూ ట్విస్ట్

Sara Tendulkar on Deepfake Pics: రీసెంట్‌ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై సారా టెండూల్కర్ స్పందించింది. తన డీప్‌ఫేక్ ఫొటోలను కూడా కొందరు ట్విటర్‌లో వైరల్ చేస్తున్నారని తెలిపింది. తనకు అస్సలు ట్విటర్‌ అకౌంటే లేదని క్లారిటీ ఇచ్చింది. తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 11:16 PM IST
Sara Tendulkar: ఆ ఫొటోలపై స్పందించిన సారా టెండూల్కర్.. నాకు అసలు అకౌంటే లేదంటూ ట్విస్ట్

Sara Tendulkar on Deepfake Pics: సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలతో ఇటీవల మహిళల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాంకేతికను మంచి పనులకు ఉపయోగించకోకుండా.. తప్పుడు పనులకు ఉపయోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ తెరపైకి రాగా.. ప్రముఖల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెండూల్కర్‌ కుమార్తె సారా తెండూల్కర్‌ కూడా డీప్‌ ఫేక్‌ వీడియోలపై స్పందింంది. తన డీప్‌ఫేక్‌ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయని.. ట్విటర్‌లో తన పేరుతో కొంతమంది ఫేక్ అకౌంట్లు తెరిచారని తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. 

"మనందరికీ మన సంతోషాలు, బాధలు, రోజువారీ కార్యకలాపాలను పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన వేదిక. కానీ కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండడం విస్తుగొలుపుతోంది. నాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో చూశాను. కొందరు కావాలనే నా పేరుపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నాకు ట్విటర్‌ అకౌంటే లేదు. అలాంటి ఫేక్ అకౌంట్లను ట్విటర్ తొలగిస్తుందని ఆశిస్తున్నా.." అని సారా టెండూల్కర్ రాసుకొచ్చింది. 

కాగా.. టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్‌లో ఉన్నారంటూ నెట్టింట రూమర్లు వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ 2023 సమయంలో టీమిండియా ఆడిన మ్యాచ్‌లకు సారా హాజరవ్వడం.. గిల్ బాగా ఆడితే ఎంకరేజ్ చేయడం రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. గిల్ ఔట్ అయినప్పుడు సారా ఎక్స్‌ప్రెషన్స్ కూడా అభిమానులు పసిగట్టేశారు. దీంతో వీరిద్దరి ఏదో సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. సారా తన సోదరుడు అర్జున్‌ తెండూల్కర్‌తో ఉన్న ఫొటోను డీప్‌ఫేక్‌ చేసి.. అర్జున్‌ ప్లేస్‌లో గిల్‌ ఫొటోను మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటోనే వదంతులకు కారణమైనట్లు తెలుస్తోంది. 

ఈ డీఫ్ ఫేక్ పిక్స్‌పై సారా టెండూల్కర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల రష్మికతోపాటు కాజోల్, కత్రినా కైఫ్‌ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో వెంటనే యాక్షన్ స్టార్ట్ చేసింది. ఈ విషయంపై చర్చంచేందుకు సోషల్ మీడియా కంపెనీలతో సమావేశం కానుంది. అవసరమైతే డీప్‌ఫేక్‌పై కొత్త చట్టం తీసుకువస్తామని కేంద్రమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ ఇప్పటికే తెలిపారు.

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

Also Read:  Vivo V29E 5G Price: అదిరిపోయే కెమెరా కలిగిన Vivo V29e 5G మొబైల్ ఇప్పుడు కేవలం రూ. 6,099కే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News