Pat Cummins: టాలీవుడ్ ప్రిన్స్ ను కలిసిన ప్యాట్ కమిన్స్, ఫోటోలు వైరల్

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడుతోంది. తాజాగా కమిన్స్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 22, 2024, 09:35 PM IST
Pat Cummins: టాలీవుడ్ ప్రిన్స్ ను కలిసిన ప్యాట్ కమిన్స్, ఫోటోలు వైరల్

Pat Cummins-Mahesh Babu Pic viral: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. ఆల్ రౌండ్ షో అదరగొడుతూ దూసుకుపోతుంది. ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్ హెచ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హైదరాబాద్ అద్భుతంగా ఆడుతోంది. గతేడాది ఆసీస్ కు రెండు ఐపీసీ ట్రోఫీలు అందించిన ఈ స్పీడ్‌స్ట‌ర్ ఇప్పుడు సన్ రైజర్స్ కు కప్ అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. కమిన్స్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబును హైద‌రాబాద్‌లో క‌లిశాడు. టాలీవుడ్ ప్రిన్స్ ను కలిసిన ఫోటోలను స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'మహేష్ బాబును కలిసినందుకు చాలా సంతోషేంగా ఉంది' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

త్వరలోనే మహేష్-రాజమౌళి షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మెుదలుకానుంది. దీని కోసం మహేష్ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. మహేష్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఈ ఏడాది గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. రాజమౌళి సినిమాతో ఎలాగైనా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. 

Also Read: IPL 2024 Updates: అంపైర్‌తో గొడ‌వ‌.. విరాట్ కోహ్లీకి భారీ జరిమానా..

దూసుకుపోతున్న సన్ రైజర్స్..
కమిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ చెలరేగి ఆడుతోంది. ఈ సీజన్ లో భారీ స్కోర్లు కొడుతూ ప్రత్యర్థి జట్లను వణికిస్తోంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్లు చేసిన జట్టుగా సన్ రైజర్స్ చరిత్ర సృష్టించింది. ఈ ఐపీఎల్ ఆ ఫీట్ ను రెండు సార్లు సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌, హెన్రిచ్ క్లాసెన్‌లు ప్రత్యర్థి బౌలర్ల పట్ల సింహాస్వప్నంలా మారుతున్నారు. కమిన్స్, భువ‌నేశ్వ‌ర్, న‌ట‌రాజ్‌లు బౌలింగ్ లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం కమిన్స్ సేన ఏడు మ్యాచుల్లో ఐదు గెలిచి పది పాయింట్లతో టాప్-3లో కొనసాగుతోంది. హైదరాబాద్ తన తర్వాత మ్యాచ్ ను ఏప్రిల్ 25న ఆర్సీబీతో తలపడనుంది.

Also Read: IPL 2024 Playoff Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి ఆ రెండు జట్లు ఔట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News