India vs Afghanistan: 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న రోహిత్, కోహ్లీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..

Team India T20I squad: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది టీమిండియా. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లీ టీ20ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 09:11 PM IST
India vs Afghanistan: 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న రోహిత్, కోహ్లీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..

IND vs AFG, T20I squad selection highlights: అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. భారత్‌-అఫ్గాన్‌ల మధ్య మూడు టీ20 మ్యాచ్లు జనవరి 11, 14, 17 తేదీలలో జరుగుతాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీలను ఈ సిరీస్ కు ఎంపిక చేసింది అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత రోహిత్‌, కోహ్లీలు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో వీరిద్దరి టీ20 కెరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు. అయితే సడన్ గా రోహిత్, కోహ్లీలను ఎంపిక చేసి షాకిచ్చారు సెలక్టర్లు. 

గాయాల కారణంగా హార్ధిక్‌ పాండ్యా, సూర్కకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ సిరీస్ ఆడటం లేదు. అఫ్గాన్‌తో సిరీస్‌లో రోహిత్‌ శర్మనే కెప్టెన్ గా వ్యవహారించనున్నాడు. ఈసారి టీ20 జట్టులో వికెట్‌ కీపర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. ఇషాన్‌ కిషన్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదు. యువ వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు కూడా చోటు దక్కింది. యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్‌ వంటి యువ ఆటగాళ్లు మరోసారి అవకాశం కల్పించారు సెలక్టర్లు. జడేజా, బుమ్రా, సిరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్, కెఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. 

Also Read: Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన ఇండియా, ఆఫ్ఘన్ జట్టు ఇదే

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, ముఖేశ్‌ కుమార్‌.

Also Read: WTC Points Table: డ‌బ్ల్యూటీసీలో ఆస్ట్రేలియాకు అగ్రస్థానం.. దిగజారిన భారత్ ర్యాంక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News