Telangana: పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా కరోనా

తెలంగాణ ( Telangana ) లో కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనం మాత్రం కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లికి హాజరై...వెంట కరోనా వైరస్ తెచ్చుకున్నారు. 

Last Updated : Aug 27, 2020, 05:19 PM IST
Telangana: పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా కరోనా

తెలంగాణ ( Telangana ) లో కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనం మాత్రం కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లికి హాజరై...వెంట కరోనా వైరస్ తెచ్చుకున్నారు. 

కోవిడ్ నిబంధనల  ( Covid guidelines ) ప్రకారం పెళ్లిళ్లకు ( Marriages ) పరిమిత సంఖ్యలో అనుమతి ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ ( Social distance ) కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేకుంటే అందరూ ప్రమాదంలో పడతారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ఇంత స్పష్టంగా ఉన్నా సరే..జనం మాత్రం ఖాతరు చేయడం లేదు. పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యకు మించి హాజరై..నిబంధనల్ని పట్టించుకోక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అదే జరిగింది. తెలంగాణ ( Telangana ) లోని బోధన్ పట్టణ పరిధి ( Bodhan ) లో జరిగిన ఓ వివాహ వేడుకలో. చెక్కీ క్యాంపులో పది రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లి వేడుకకు లెక్కకు మించి హాజరయ్యారు. అందులో ఒకరికి కరోనా వైరస్ ( Corona virus ) సోకడంతో..అప్రమత్తమైన అధికారులు  పెళ్లికి హాజరైనవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేశారు. ఏకంగా 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. ఈ క్యాంపులో ఉన్న ఇళ్లు కేవలం 193. ఇందులో 42 ఇళ్లలో వారికి కరోనా వైరస్ సోకింది. 

నిబంధనల ప్రకారం పెళ్ళిళ్లకు 50 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదు. అది కూడా ఎక్కడికక్కడ శానిటైజేషన్ వ్యవస్థ ( Sanitization ) , మాస్క్ లు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేయాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల ఇలా జరగడం లేదు. కరోనా వైరస్ ( Corona virus ) బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2 వేల 795 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1 లక్షా 14 వేల 483కు చేరుకుంది. 

Trending News