Etela Rajender Delhi Tour: బీజేపీ నేతగా తొలిసారి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ!

Bandi Sanjay Kumar Delhi Tour: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన అనంతరం హుజురాబాద్‌లో రాజకీయాలు మారుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం హుజురాబాద్ నుంచే తమ విజయం మొదలుపెట్టాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2021, 10:01 AM IST
Etela Rajender Delhi Tour: బీజేపీ నేతగా తొలిసారి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ!

Etela Rajender Delhi Tour: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇటీవల బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్, ఈటల రాజేందర్ నేటి సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

బీజేపీలో చేరిన అనంతరం మాజీ మంత్రి ఈటల తొలిసారిగా అమిత్ షాను కలవనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగస్టు 9న చేపట్టనున్న పాదయాత్రకు బీజేపీ కీలక నేత అమిత్ షాను ఆహ్వానించనున్నారని సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని విషయాలు అమిత్ షాతో చర్చించనున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender)పై నమోదైన కేసులను అమిత్‌షాకు బండి సంజయ్‌ వివరించనున్నారని సైతం ప్రచారం జరుగుతోంది. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సైతం ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News