TS Jobs 2022: గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌..

అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రకటించిన విధంగానే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరం అయింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ తో పాటు స్టైఫండ్‌ కూడా ఇవ్వనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 06:22 PM IST
  • తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌
  • నిరుద్యోగులకు స్టైఫండ్‌తో కూడిన ఉచిత కోచింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25 వేల మందికి ఉచిత కోచింగ్‌
  • అన్‌ అకాడమితో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం
TS Jobs 2022: గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌..

TS Jobs 2022: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రకటించిన విధంగానే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరం అయింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ అందివ్వనున్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం, డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన  103 స్టడీ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 

16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25,000 మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి ఆన్లైన్, ఆప్లైన్ మోడ్లో శిక్షణ ఇస్తామన్నారు. అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా మరో 50, 000 మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక ఆన్ అకాడమీతో బీసీ మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.  బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్ లో రిజర్వేషన్లు కూడా తీసుకువచ్చారు. బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు కేటాయించారు. 

అన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 16 వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష ఉండనుంది. డెస్క్టాప్, ల్యాప్టాప్ లతోపాటు మొబైల్ ఫోన్ల ద్వారా పరీక్ష రాసే సౌకర్యం కల్పిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిలిమ్స్, మెయిన్స్‌ కలిపి ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. దాదాపు పది వేల మంది అభ్యర్థులకు అందించే ఈ శిక్షణలో నెలకు ఐదు వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్‌ నుని సైతం అందిస్తారు. 

గ్రూప్ 2, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు కోచింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికీ నెలకు రెండు వేల చొప్పున మూడు నెలలపాటు స్టైఫండ్‌ అందిస్తారు. ఈనెల 20 లేదా 21 నుంచి కోచింగ్ క్లాసులు ప్రారంభంకానున్నాయి. ఈ మెకానిజం కోసం అయ్యే టెక్నాలజీ మొత్తం CSR ఫండ్ కింద UNACADEMY సొంతంగా భరిస్తుంది.

Also Read: Rohit Sharma: మరో 54 పరుగులే.. రోహిత్‌ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు! రెండో క్రికెటర్‌గా..

Also Read: RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీకి కాసుల వర్షం.. 12 రోజుల వసూళ్ల లెక్కలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News