హైద్రాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం: రోడ్లు జలమయం

Last Updated : Jun 12, 2018, 08:13 PM IST
హైద్రాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం: రోడ్లు జలమయం

 ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలుతో కూడిన వర్షం కురుస్తోంది. నిత్యం రద్దీ ఉండే  కోఠి, అబిడ్స్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో  రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్భంధంలో ఉన్నాయి. 

పశ్చిమ బెంగాల్‌ నుంచి  ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో వల్ల రానున్న 24 గంటల్లో హైదరాబాద్ తో పాటు  మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట,  మంచిర్యాల, పెద్దపల్లి,  భద్రాద్రి . కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Trending News