Marriage అయిన 24 గంటలకే road accident.. వరుడు మృతి, కోమాలో వధువు

Newly wed bridegroom killed, bride in coma: హైదరాబాద్: కొత్తగా పెళ్లి చేసుకున్న ఆనందం ఆ జంటకే కాదు.. ఆ రెండు కుటుంబాలకు కూడా ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి అయిన అనంతరం కొన్ని గంటలకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వధువు కోమాలోకి జారుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 11:30 PM IST
Marriage అయిన 24 గంటలకే road accident.. వరుడు మృతి, కోమాలో వధువు

Newly wed bridegroom killed, bride in coma: హైదరాబాద్: కొత్తగా పెళ్లి చేసుకున్న ఆనందం ఆ జంటకే కాదు.. ఆ రెండు కుటుంబాలకు కూడా ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి అయిన అనంతరం కొన్ని గంటలకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వధువు కోమాలోకి జారుకుంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌కి చెందిన శ్రీనివాసులు అనే యువకుడికి, చెన్నైకి చెందిన కనిమోళి అనే యువతికి ఈ నెల 21న తిరుపతిలో వివాహం జరిగింది. వివాహం అనంతరం మరునాడు తమ తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధు మిత్రులతో కలిసి శ్రీనివాసులు, కనిమొళి దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ నుంచి చెన్నైలో ఉండే అత్తమామల ఇంటికి వెళ్లాలని భావించిన శ్రీనివాస్ తన కుటుంబసభ్యులు, ఇతర సమీప బంధువులతో కలిసి చెన్నైకి బయల్దేరారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి వద్దే వారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు నడుపుతూ తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు మృతి చెందాడు (Newly wed bridegroom killed). 

పెళ్లి కుమారుడు శ్రీనివాసులు చనిపోయాడన్న దుర్వార్త నుంచి ఆ రెండు కుటుంబాలు ఇంకా తేరుకోకముందే.. ఇదే రోడ్డు ప్రమాదంలో (Newly wed couple met with an accident) తీవ్రంగా గాయపడిన నవ వధువు కనిమొళి కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News