Bandi Sanjay Kumar: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు అస్వస్థత.. సెల్ఫ్ క్వారంటైన్?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar)‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Last Updated : Sep 27, 2020, 11:53 AM IST
Bandi Sanjay Kumar: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు అస్వస్థత.. సెల్ఫ్ క్వారంటైన్?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar)‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అస్వస్థతకు గురయ్యారని తెలియగా తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే బండి సంజయ్ (Telangana BJP president Bandi Sanjay Kumar)‌కి కరోనా వైరస్ సోకగా, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరినట్లు వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. కరోనా వైరస్ (CoronaVirus) లక్షణాలు కనిపించడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారని మరో వార్త ప్రచారంలో ఉంది. 

కాగా, బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు కృష్ణదాస్‌కు ఇటీవల నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టులలో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయనతో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న బండి సంజయ్‌కి కరోనా లక్షణాలు కనిపించాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ బండి సంజయ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కోవిడ్19 టెస్టులకు బండి సంజయ్ వెళ్లారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ శ్రేణుల్లో మాత్రం గందరగోళం నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ నేటి ఉదయం కన్నుమూయగా.. ఆయన మృతిపట్ల బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. 

Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News