Jagga Reddy: కాంగ్రెస్ లో ముదిరిన వార్.. రేవంత్ రెడ్డితో తాడోపేడో! రేపు జగ్గారెడ్డి సంచలన ప్రకటన..

Jagga Reddy:  తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు

Written by - Srisailam | Last Updated : Jul 3, 2022, 02:17 PM IST
  • టీకాంగ్రెస్ లో ముదిరిన వార్
  • రేపు జగ్గారెడ్డి సంచలన ప్రకటన
  • రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే
Jagga Reddy: కాంగ్రెస్ లో ముదిరిన వార్.. రేవంత్ రెడ్డితో తాడోపేడో! రేపు జగ్గారెడ్డి సంచలన ప్రకటన..

Jagga Reddy:  తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు. జగ్గారెడ్డి ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి రాజేసింది. జగ్గారెడ్జి ఏం చేయబోతున్నారన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తారని కొందరు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొనసాగిస్తే తాను పార్టీలో ఉండబోనని వార్నింగ్ ఇవ్వొచ్చని మరికొందరు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నారు జగ్గారెడ్డి. దీంతో జగ్గారెడ్డి కారెక్కనున్నారనే ప్రచారమే ఎక్కువగా సాగుతోంది.

కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు పెద్దగా బయటికి రాలేదు. అంతా సర్ధుకుందని భావిస్తున్న సమయంలోనే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన టీకాంగ్రెస్ లో సెగలు రేపింది. యశ్వంత్ సిన్హాను ఎవరు కలవొద్దని చెప్పారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాని సీనియర్ నేత వి హనుమంతరావు బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం చెప్పారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సిన్హాను కలిశారు వీహెచ్. సంగారెడ్జి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధమయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి హైదరాబాద్ వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవరపోవడం సరికాదన్నట్లుగా జగ్గారెడ్డి మాట్లాడారు. అయితే యశ్వంత్ సిన్హాను కలవొద్దని పీసీసీ చెప్పినా వీహెచ్ వెళ్లి కలవడంపై రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే గోడకేసి కొడతామంటూ ప్రకటించారు.

రేవంత్ రెడ్డి చేసిన వార్నింగ్ కాంగ్రెస్ పార్టీలో మరింత రచ్చ రాజేసింది. గోడకేసి కొడతానన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ తీరు సరిగా లేదన్నారు. సీనియర్ నేతను కొడతానని ఎలా అంటారని ప్రశ్నించారు. టెమ్ట్ అయ్యే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పనికిరాడని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై హైకమాండ్ కు లేఖ రాస్తానని.. పీసీసీ చీఫ్ గా ఆయనను తొలగించాలని కోరుతానని జగ్గారెడ్డి చెప్పారు. అంతేకాదు రేవంత్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన కామెంట్లు పార్టీలో దుమారం రేపుతుండగానే... ఆదివారం మరో ప్రకటన చేశారు జగ్గారెడ్డి. సోమవారం తాను సంచలన నిర్ణయం చెప్పబోతున్నానని చెప్పారు. దీంతో జగ్గారెడ్డి ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. జగ్గారెడ్డి తీసుకోబోయే నిర్ణయం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంటుందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Read also: Cook Yadamma: ప్రధాని మోడీ వంట మనిషి యాదమ్మకు అవమానం జరిగిందా? బీజేపీ సమావేశాల్లో అసలేం జరిగింది?

Read also: Kcr Shock: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కార్పొరేషన్ మేయర్  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News