Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్‌ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 28, 2024, 05:57 PM IST
Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

KT Rama Rao: తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు.. వారికి భరోసానిస్తూ గులాబీ పార్టీ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పొలాల బాట పట్టారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కరువుతో ఎండిన రైతుల పొలాలను గురువారం చూశారు. రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి వారిని ఓదార్చారు. ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్‌ సంచలన సవాల్‌

అనంతరం మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతూ..రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని పునరుద్ఘాటించారు. గతేడాది ఈ సమయానికి కేసీఆర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తెలంగాణవ్యాప్తంగా నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ మీద కక్ష్యతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లు కుంగిపోతే వద్ద కాపర్ డామ్ కడితే అయిపోయేదానికి రైతులను ఎండబెడుతున్నారని వాపోయారు.

Also Read: Congress List: కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. రేవంత్‌ రెడ్డి వర్గానికే టికెట్లు

 

'ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరగడం తప్ప.. కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించే తీరిక రేవంత్‌ రెడ్డికి లేదు. ఇప్పటికే కరువుతో 200 మంది రైతులు చనిపోయారు. ఇకనైనా రైతులను ఆదుకోవాలి' అని ప్రభుత్వానికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 'చేస్తానన్న రుణమాఫీ చేయలేదు. ఆగకుండా బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ, మెడపైన కత్తి పెట్టి కడతారా చస్తారా అన్నట్లు ఉంది' అని తెలిపారు. రైతులకు ఇస్తానన్న క్వింటాలుకు 500 బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు ధైర్యంగా ఉండండి తాము ఉన్నామనే భరోసా కేటీఆర్‌ ఇచ్చారు. రైతులు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతుబంధు కోసం కేసీఆర్ రూ.7 వేల కోట్లు పెట్టిపోతే.. వాటిని రేవంత్‌ రెడ్డి కాంట్రాక్టర్లకు ఇచ్చిండని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. త్వరలోనే కేసీఆర్‌ కూడా రైతులకు భరోసా ఇచ్చేందుకు కదిలి వస్తున్నట్లు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News