Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ దీక్షా దివస్‌పై ఈసీ ఎన్నికల సంఘం అభ్యంతరం

Telangana Assembly Election 2023 Live Updates: తెలంగాణలో అధికారం ఎవరిది..? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? బీజేపీ పుంజుకుంటుందా..? మరో 48 గంటల్లో ఓటరు తీర్పునివ్వబోతున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 29, 2023, 03:57 PM IST
Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ దీక్షా దివస్‌పై ఈసీ ఎన్నికల సంఘం అభ్యంతరం
Live Blog

Telangana Assembly Election 2023 Live Updates:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారం పర్వానికి తెరపడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా-నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని విషయాలు బేరీజు వేసుకున్న ఓటర్లు.. ఈ నెల 30వ తేదీన తీర్పునిచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ 48 గంటలు అభ్యర్థులకు చాలా కీలకం కానుంది. మరోవైపు ఓటింగ్‌ను పక్కా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను సిద్ధంగా ఉంచునున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.. 

29 November, 2023

  • 15:57 PM

    జనగామలో డీఆర్సీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం ఎన్నికల సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.

  • 15:57 PM

    జనగామలో డీఆర్సీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం ఎన్నికల సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.

  • 15:52 PM

    కల్వకుర్తిలో కాంగ్రెస్‌ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారని దాడి చేసిన బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడగా.. దాడికి నిరసనగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకుని.. ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. పురపాలక ఛైర్మన్‌ దాడి చేశారని పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

  • 14:06 PM

    ఓటు వేయడానికి ఈవీఎమ్ మెషీన్లు ఉపయోగిస్తారు. ఈవీఎమ్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్. ఈవీఎమ్‌లో రెండు విభాగాలు ఉంటాయి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ ఇలా రెండు భాగాలు ఉంటాయి. కంట్రోల్ యూనిట్ ఎన్నికల అధికారి చేతిలో ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ రహాస్యంగా ఉంచి బూత్‌ లోపల ఉంటుంది. గతంలో బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు. ఇప్పుడు దాని స్థానంలో ఓటు వేసేందుకు పోలింగ్ అధికారి బ్యాలెట్‌ను రిలీజ్ చేస్తారు. ఓటరు తాను వేయాలనుకున్న అభ్యర్థి ఎన్నికల గుర్తుకు ఎదురుగా బటన్ నొక్కాలి. ఓటు ఎవరికి వేసిన విషయం రహాస్యంగా ఉంటుంది. 
     

  • 12:55 PM

    నిర్మల్‌ జిల్లా భైంసాలో అర్ధరాత్రి బీజేపీ అభ్యర్థి పటేల్‌ రామారావు బంధువు ఇంట్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసులు చెకింగ్‌కు రాగా.. బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘర్షణ ఘటనలో పలువురు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

  • 12:44 PM

    తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్‌పై ఈసీ ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. ప్రచారం గడువు ముగిసినందున నిర్వహణకు అనుమతి లేదని తెలిపింది. పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించవద్దని ఈసీ అధికారులు సూచించారు. అయితే దీక్షా దివస్‌ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహణకు అంగీకరించిన అధికారులు అంగీకరించారు. మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు రక్తదానం చేశారు.

  • 12:32 PM

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. బుధవారం సాయంత్రం నుంచే పోలింగ్ కేంద్రాలు భద్రతా సిబ్బంది అధీనంలోకి వెళ్లనున్నాయి. 65 వేల మంది తెలంగాణ పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు, పక్క పోలీసులతో కలిపి సుమారు లక్ష మంది వరకు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

  • 11:29 AM

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు ఓటు వేయకపోతే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ కామెంట్స్‌పై ఈసీ స్పందించింది. ఈ వ్యాఖ్యలపై విచారణ నిర్వహించి.. నివేదిక అందజేయాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 
     

  • 10:40 AM

    మీ ఓటు పడిందో..? లేదో..? ఇలా తెలుసుకోండి

    కేంద్రంలో అధికారి మీ వేలికి ఇంక్ వేసి, ఈవీఎం కంట్రోల్ యూనిట్ బటన్ నొక్కగానే మీకు ఓటు వేసే అవకాశం వస్తుంది. రహస్య స్థలంలో మీరు బ్యాలెట్ యూనిట్లో ఉండే బటన్ నొక్కాలి. బీప్ శబ్దం వస్తే ఓటు పడినట్లు. పక్కనే ఉన్న వీవీప్యాట్ యంత్రంలో మీరు ఎవరికి ఓటు వేశారనేది పది సెకన్ల పాటు కనిపిస్తుంది. పొరపాటున ఈవీఎంలో రెండు సార్లు నొక్కినా.. ఫస్ట్ నొక్కిన గుర్తుపైనే ఓటు పడుతుంది.

  • 10:21 AM

    మీ ఓటు ఇతరులు వేస్తే ఇలా చేయండి..!

    మన ఓటును ఇతరులు వేస్తే దాన్ని రద్దు చేసి, మళ్లీ ఓటేసే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49(పి) ప్రకారం దీన్ని 'టెండర్డ్ ఓటు' అంటారు. మీ ఓటును ఇతరులు ఓటేసినట్లు గుర్తిస్తే.. వెంటనే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేసి.. ఓటర్ గుర్తింపు కార్డు అందించండి. కొంత ప్రక్రియ తర్వాత ఓటేయవచ్చు. అయితే ఈవీఎంలో టెండర్డ్ ఓటు వేయలేం. ప్రత్యేక కవర్లో మన ఓటును భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపుతారు.

  • 10:21 AM

    మీ ఓటు ఇతరులు వేస్తే ఇలా చేయండి..!

    మన ఓటును ఇతరులు వేస్తే దాన్ని రద్దు చేసి, మళ్లీ ఓటేసే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49(పి) ప్రకారం దీన్ని 'టెండర్డ్ ఓటు' అంటారు. మీ ఓటును ఇతరులు ఓటేసినట్లు గుర్తిస్తే.. వెంటనే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేసి.. ఓటర్ గుర్తింపు కార్డు అందించండి. కొంత ప్రక్రియ తర్వాత ఓటేయవచ్చు. అయితే ఈవీఎంలో టెండర్డ్ ఓటు వేయలేం. ప్రత్యేక కవర్లో మన ఓటును భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపుతారు.

  • 10:18 AM

    పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్‌కు మధ్య తేడా ఇదే..

    పోలింగ్ స్టేషన్ అంటే ఓటింగ్ నిర్వహించే భవనం లేదా ప్రాంగణం. పోలింగ్ స్టేషన్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ బూత్‌లు ఉంటాయి. పోలింగ్ బూత్ అంటే ఓటర్లు ఓటేసేందుకు ఏర్పాటు చేసిన చిన్న గది లాంటి ప్రదేశం. అందులో ఓటర్లు వ్యక్తిగతంగా ఓటేస్తారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన నిబంధనలు చట్టం 1951లో ఉంటాయి. భారత ఎన్నికల సంఘం కూడా వీటి విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

  • 10:16 AM

    ==> మొదటి అధికారి జాబితాలో మీ పేరును పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే రెండో అధికారి దగ్గరకు పంపుతారు.

    ==> రెండో అధికారి మీ వేలుకు ఇంక్ అంటించి, చీటీ అందిస్తారు.

    ==> ఆ చీటీని మూడో అధికారి పరిశీలిస్తారు. అనంతరం ఈవీఎం దగ్గరకు పంపుతారు.

    ==> ఈవీఎలో బటన్ నొక్కగానే బీప్ అని పెద్దగా శబ్దం వస్తుంది. లేదంటే అధికారికి సమాచారం ఇవ్వాలి.

  • 23:41 PM

    కరీంనగర్‌ నియోజకవర్గం కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఓటరు స్లిప్పుల్లో డబ్బులు పంచుతున్నారని బీజేపీ శ్రేణుల ఆరోపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. కొత్తపల్లికి చేరుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్త మధ్య ఘర్షణ నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బండి సంజయ్‌కు నచ్చజెప్పి పంపించారు.

  • 20:27 PM

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి అంటే నవంబర్ 29, 30 తేదీల్లో సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1న తిరిగి విద్యాసంస్థలు తెర్చుకోనున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

  • 19:18 PM

    ==> రాష్ట్రంలో ముగిసిన ప్రచార గడువు
    ==> సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: ఈసీ
    ==> అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశం
    ==> టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారానికి నో పర్మిషన్
    ==> ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు
    ==> పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటనపై నిషేధం

  • 18:35 PM

    అధికారంలోకి వస్తే వంద రోజల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో మరింత దూకుడుగా వ్యహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రవ్యాప్తంగా 10 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ 23 సభల్లో పాల్గొనగా.. ప్రియాంక గాంధీ 26 సభలకు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం నిర్వహించిన 55 సభలకు హాజరయ్యారు. 

  • 18:06 PM

    తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అధికార బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల రంగంలోకి దిగారు. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావులు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. ప్రతి రోజూ రెండు మూడు సభల్లో పాల్గొంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. మొత్తం 96 బహిరంగ సభల్లో మాట్లాడారు.
     

  • 17:56 PM

    ==> తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం 

    ==> 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్

    ==> ప్రచార, ప్రసార మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం బంద్ 

    ==> రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్

    ==> స్థానికులు కాకుండ ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు 

    ==> నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు

  • 17:07 PM

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గత రెండు నెలలుగా హోరెత్తించిన మైకులు సైలెంట్ అయ్యాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి చివరి నిమిషం వరకు అన్ని పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరను కలుసుకుంటూ తమకే ఓటు వేయాలని కోరారు.

  • 16:46 PM

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా గురువారం రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు కచ్చితంగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్ తెలిపారు. ఉద్యోగుల ఓటు వేసే అన్ని సంస్థలు సెలవు ఇవ్వాలన్నారు. గత ఎన్నికల సమయంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని ఆయన ఆదేశించారు.

  • 16:32 PM

    గజ్వేల్‌ తన గౌరవాన్ని పెంచిందని సీఎం కేసీఆర్ అన్నారు. తనను ముఖ్యమంత్రిని చేసి.. ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరిరోజు గజ్వేల్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. గత 24 ఏళ్లుగా తెలంగాణనే ఆశగా.. శ్వాసగా బతుకుతున్నాని ఆయన అన్నారు. గజ్వేల్‌కు కచ్చితంగా ఐటీ టవర్లు తీసుకువస్తామని.. కొండ పోచమ్మ ఆలయాన్ని అద్భుతంగా మార్చుకుందామని చెప్పారు.

  • 16:24 PM

    ==> మరో కాసేపట్లో ముగియనున్న ఎన్నికల ప్రచారాలు  

    ==> తెలంగాణ రాష్ట్రమా ఇగ ఊపిరి పిల్చుకో 

    ==> సుమారు నెల రోజులుగా ఊరువాడ, పల్లె పట్టణం తేడా లేకుండా, వివిధ పార్టీల మైకు సప్పుళ్లతో మోగించిన మోతలు బంద్ 

    ==> నాయకుల ప్రచారాలు, ఓటర్ల కోసం చేసిన స్కిట్లు బంద్  

    ==> టీవీల్లో, పేపర్లలలో హోరెత్తిన ప్రకటనలు బంద్ 

    ==> తిరిగి మరో ఐదు సంవత్సరాల వరకు సెలవు 

    ==> ఇక పార్టీలపై, నాయకులపై, ప్రచారాలపై ప్రలోభాలపై ఎన్నికల సంఘం నజర్ 
     

  • 15:07 PM

    "ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా..
    సిర్పూర్ నుండి అలంపూర్ దాకా..
    భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా..
    తాండూర్ నుండి చెన్నూర్ దాకా..
    మధిర నుండి ముదోల్ దాకా...
    మక్తల్ నుండి జుక్కల్ దాకా..
    తెలంగాణ అంతటా కారు జోరు!
    మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!" అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • 14:00 PM

    ==> హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలు

    ==> తనను గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామన్న కౌశిక్ రెడ్డి

    ==> మీరు ఓటేసి దీవిస్తే 4వ తారీకు నా జైత్రయాత్ర

    ==> గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటాం.

    ==> మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి

    ==> కమలాపూర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి

Trending News