Telangana Assembly Elections 2023 LIVE: డబ్బుల పంపిణీ వ్యవహారం.. రోడ్డెక్కిన మహిళలు..!

Telangana Assembly Elections 2023 LIVE Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసిపోయింది. ఇక ఓటరు తీర్పునకు సమయం ఆసన్నమైంది. గురువారం పోలింగ్ మొదలుకానుంది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరచనున్నారు. ఎన్నికల అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 29, 2023, 10:53 PM IST
Telangana Assembly Elections 2023 LIVE: డబ్బుల పంపిణీ వ్యవహారం.. రోడ్డెక్కిన మహిళలు..!
Live Blog

Telangana Assembly Elections 2023 LIVE Updates: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలుకానుంది. ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో అధికారులు చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరు అధికారంలోకి వస్తారు..? ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..

29 November, 2023

  • 22:53 PM

    Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో దాదాపు 12వేల క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మొత్తం 35,655 పోలింగ్ ఏర్పాటు చేశామని.. మోడల్ పోలింగ్ స్టేషన్లు, మహిళా పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు.

  • 22:22 PM

    Telangana Assembly Election 2023: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కాలనీలోని యూరో కిడ్స్ స్కూల్ (Omega hospital beside) పోలింగ్ బూత్ లో(159) తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • 22:04 PM

    Telangana Assembly Election 2023: హైదరాబాద్‌లోని బోరబండలో పోలీసులు పెద్దఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. వినాయక్‌ నగర్‌, బంజారా నగర్‌లో బెల్డ్ షాపులపై దాడులు నిర్వహించి.. దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.

  • 21:22 PM

    Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని పార్కులకు సెలవు ప్రకటించింది హెచ్‌ఎండీఏ. పోలింగ్ సందర్భంగా అన్ని పార్కులను మూసివేస్తున్నట్లు తెలిపింది. 

  • 21:20 PM

    Telangana Assembly Election 2023: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది. ముషీరాబాద్‌ పరిధిలో డబ్బుల స్వాధీనం విషయంలో డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌ పక్షపాతంగా వ్యవహించారని సస్పెండ్ చేసింది.

  • 21:10 PM

    Telangana Assembly Election 2023: నిజామాబాద్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. దీంతో పోలింగ్ కేంద్రాలు చీకట్లోనే ఉండిపోయాయి. కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

  • 21:01 PM

    Telangana Assembly Election 2023: మిర్యాలగూడలో నగదు పంపిణీలో వివాదం తలెత్తింది. తమకు డబ్బులు ఇవ్వలేదని 39వ వార్డు సుందరయ్య నగర్‌లో కాలనీవాసుల ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు కొందరికే డబ్బులు ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులో ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని మహిళలు రోడెక్కి ఆందోళన చేపట్టారు.  

  • 20:40 PM

    Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రైవేటు కంపెనీలు రేపు సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. చాలా కంపెనీలు  రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • 20:18 PM

    ==> రేపు ఉదయం 7.30కి చింతమడకలో సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

    ==> ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లో గల బీఎస్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.

  • 20:17 PM

    ==> రేవంత్ రెడ్డి ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు కొడంగల్‌లోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు 
    ==> ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి కోదాడలోని గ్రేస్ వ్యాలీ ఐడిఎల్ స్కూల్లో ఓటు వేస్తారు 
    ==> భట్టి విక్రమార్క మధిరలో ఓటు వేస్తారు.
    ==> కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో వేస్తారు

  • 19:24 PM

    ఇంక్ ఎందుకు చెరిగిపోదంటే..?

    Telangana Assembly Election 2023: ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఓటేశారని సిరా చుక్క గుర్తుగా వేస్తారు. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. 1962 నుంచి బ్లూ ఇంక్ విధానాన్ని వాడుతున్నారు. ఈ ఇంక్‌ను మైసూర్‌లోని పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేస్తుంది. దేశంలో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. ఈ ఇంక్‌లో సిల్వర్ నైట్రేట్‌తో పాటు మరికొన్ని రసాయనాలు ఉపయోగించడం వల్ల సిరా చెరిగిపోకుండా ఉంటుంది.

  • 19:09 PM

    Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఓటు వేసేందుకు వెళుతున్న ఉద్యోగులు లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు కార్డు కూడా జత చేయాలని.. పెయిడ్ హాలీ డే మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణ ఉద్యోగులు అందరికీ సెలవు వర్తించదని.. ఓటు హక్కు ఉన్నవాళ్లకే లీవ్ ఉంటుందని పేర్కొంది. 

  • 18:39 PM

    Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేచురల్ స్టార్ నాని కోరాడు. 'రాబోయే 4 సంవత్సరాలు మిమ్మల్ని, మీ రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో రేపు మీరు నిర్ణయించుకోవాలి. డబ్బు, లంచం లేదా కులం దీనిని నిర్ణయించకూడదు. మీ మనస్సాక్షితో ఓటేయండి' అని నాని ట్వీట్ చేశాడు. హీరో నితిన్ సైతం ప్రజలంతా ఓటేయ్యాలని సూచిస్తూ వీడియో రిలీజ్ చేశాడు.

     

     

  • 18:36 PM

    Telangana Assembly Election 2023: ఓటరు లిస్టులో పేరు లేకుంటే ఓటేయొచ్చా..? అని చాలా మంది అడుగుతున్నారు. ఓటరు లిస్టులో పేరు లేకపోతే ఓటు వేసేందుకు అవకాశం ఉండదు. మీరు తెలంగాణకు చెందిన వారైనా.. ఓటరు లిస్టులో మీ పేరు కచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మీ పేరు ఉంటే.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
        

  • 18:00 PM
  • 18:00 PM
  • 17:55 PM

    Telangana Election 2023: మంత్రి గంగుల కమలాకర్‌కు బండి సంజయ్ సవాల్

     

Trending News