Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణ‌లో త‌న బంధువును ఎంపీగా గెలిపించ‌మ‌ని చిరంజీవి పిలుపు..

Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణ‌లో త‌న బంధువును ఎంపీగా గెలిపించ‌మ‌ని చిరంజీవి పిలుపు.. : తెలంగాణ స‌హా దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌లు క్ర‌తువు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడ‌త‌లో తెలంగాణ‌, ఏపీ స‌హా దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో త‌న బంధువును గెలిపించ‌మ‌ని చిరంజీవి పిలుపు నిచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 11, 2024, 01:55 PM IST
Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణ‌లో త‌న బంధువును ఎంపీగా గెలిపించ‌మ‌ని చిరంజీవి పిలుపు..

Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణ‌లోని చేవెళ్ల లోక్ స‌భ స్థానంలో బీజేపీ త‌రుపున పోటీ చేస్తోన్న కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని ఎంపీగా గెలిపించి లోక్ స‌భ‌కు పంపాల‌ని ఆ ప్రాంత ఓట‌ర్ల‌కు చిరంజీవి విజ్ఞ‌ప్తి చేశారు. కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మా కోడ‌లు ఉపాస‌న బాబాయిగా మాకు ద‌గ్గ‌ర బంధువు అవుతారు. ఆయ‌న సౌమ్యుడు, విద్యాధికుడు, ఉత్త‌ముడు, అంద‌రికీ అందుబాటులో ఉండే వ్య‌క్తి. ఇలాంటి వ్య‌క్తి ముందుకు వ‌చ్చి స‌మాజానికి సేవ చేయ‌డం ఎంతైనా అవ‌స‌రం. సుధీర్ఘ రాజ‌కీయ నేప‌థ్యమున్న కొండ రంగారెడ్డి మ‌న‌వ‌డిగా రాజ‌కీయ రంగ ప్రవేశం చేసారు. ప్ర‌జాసేవ‌, చేవెళ్ల పార్లమెంట్ ప‌రిధి అభివృద్ది ల‌క్ష్యంగా బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. తాజాగా చిరంజీవి.. రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా దేశ రెండో అత్యున్నత పుర‌స్కారమైన ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్న సంద‌ర్భంగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి చిరంజీవికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌ర‌సకు చిరంజీవి, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి వియ్యంకులు అవుతారు.

కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి విష‌యానికొస్తే..  2024 లోక్ స‌భ‌కు  భార‌తీయ జ‌నతా పార్టీ త‌రుపున పోటీ చేస్తున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్య‌ర్ధి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇపుడు ఆయ‌న కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎంపీగా పోటీచేస్తున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ త‌రుపున కాసాని జ్ఞానేశ్వ‌ర్ బ‌రిలో ఉన్నారు. అటు 2014లో బీఆర్ఎస్ త‌రుపున కొండా తొలిసారి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇపుడు ముచ్చ‌ట‌గా మూడోసారి భార‌తీయ జ‌నతా పార్టీ త‌రుపున లోక్ స‌భ‌కు పోటీ చేస్తున్నారు. ఈ సారి బీజేపీ త‌రుపున ఎంపీగా గెలిచి పార్ల‌మెంట్‌లో అడుగుపెడ‌తారా లేదా అనేది చూడాలి. ఇక తెలంగాణ నుంచి పోటీ చేస్తోన్న ఎంపీ అభ్య‌ర్ధుల్లో అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి రికార్డుల‌కు ఎక్కారు. ఏపీలో టీడీపీ త‌రుపున గుంటూరు పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న‌ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ దేశంలో అత్యంత ధ‌న‌వంతుడైన ఎంపీ అభ్య‌ర్ధిగా  రికార్డుల‌కు ఎక్కారు.

Also Read: TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ బిగ్ ట్విస్ట్.. ఇక నుంచి విధుల్లో ఆ డ్రెస్ వేసుకోవద్దు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News