Revanth Reddy Speech: కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు.. అందులో ఏమేం ఉన్నాయంటే..

Revanth Reddy Speech at Tukkuguda Congress Meeting: 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Sep 18, 2023, 04:56 AM IST
Revanth Reddy Speech: కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు.. అందులో ఏమేం ఉన్నాయంటే..

Revanth Reddy Speech at Tukkuguda Congress Meeting: హైదరాబాద్ : " తొమ్మిదేళ్ల బీఆరెస్ పరిపాలనలో రాష్ట్రంలో విధ్వసం జరిగిందని... అందుకే తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి సోనియా గాంధీ మరోసారి ఈ గడ్డపై కాలు మోపారు " అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా రాకతో తెలంగాణ నేల పులకరించిందన్నారు. విజయభేరి సభ నిర్వహించకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నించాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతు, కాంగ్రెస్ పార్టీ సభ కోసం పరేడ్ గ్రౌండ్ లో అనుమతి ఇవ్వాల్సిందిగా కోరితే అక్కడ కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. పోనీ గచ్చిబౌలి స్టేడియం ఇవ్వమని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తుక్కుగూడలో సభ జరుపుకుందామంటే దేవదాయ భూముల్లో సభలు పెట్టరాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే ఇక్కడి రైతులు ముందుకొచ్చి ఈ సభకు భూమి ఇచ్చారన్నారు అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. మీరంతా లక్షలాదిగా తరలివచ్చి విజయభేరి సభను విజయవంతం చేశారు అని చెబుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలపై మరోసారి ఫోకస్ చేస్తే..
 1. మహాలక్ష్మీ 
a. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సహాయం అందజేత
b. రూ. 500 కేగ్యాస్ సిలిండర్ అందజేత
c. మహిళలకు రాష్టమంతట టీఎస్ఆర్టీసీబస్సుల్లో ఉచిత పయ్రాణం

2. రైతు భరోసా 
a. ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15,000, వ్యవసాయకూలీలకు రూ.12,000 అందజేత
b. వరిపంటకు రూ. 500 బోనస్.

3. గృహ జ్యోతి
a. అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్య కల్పన

4. ఇందిరమ్మ ఇండ్లు 
a. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటిస్థలం,రూ. 5 లక్షల ఆర్థిక సాయం.
b. అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల ఇంటిస్థలం అందజేత.

5.యువ వికాసం 
a. విద్య భరోసా కార్డు - రూ. 5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీరహిత విద్యార్థి ఆర్ధిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ పయ్రాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీమెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయకల్పన.
b. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు.

6. చేయూత
a. ప్రతి నెలా రూ.4,000 చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత.
b. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు

Trending News