‘KCRకు దుబ్బాకలో దీపావళి గిఫ్ట్‌.. జీహెచ్‌ఎంసీలో సంక్రాంతి గిఫ్ట్’

Bandi Sanjay slams CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, మరికొన్ని రోజుల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

Last Updated : Nov 11, 2020, 08:05 PM IST
‘KCRకు దుబ్బాకలో దీపావళి గిఫ్ట్‌.. జీహెచ్‌ఎంసీలో సంక్రాంతి గిఫ్ట్’

టీఆర్ఎస్ పాలనను తెలంగాణ (Telangana) ప్రజలు వ్యతిరేకిస్తున్నారని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు  (Dubbaka ByPoll Results) నిరూపించాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, మరికొన్ని రోజుల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. జూమ్ యాప్ ద్వారా బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడారు. ‘కేసీఆర్.. నీ సొంత జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని’ బండి సంజయ్ మండిపడ్డారు.

 

సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో దొడ్డు బియ్యం పండిస్తారని, సన్నబియ్యం పండించాలని సూచించి రాష్ట్ర రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను తీసుకెళ్లి హైదరాబాద్ పాతబస్తీలో ఖర్చు పెడుతున్నారని, అసలు పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేశారో లెక్కలు చెప్పాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనుందని సర్వేలు సైతం చెబుతున్నాయని పేర్కొన్నారు. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమే హైదరాబాద్‌లో రూ.10,000 పంచుతున్నారని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌లో వేలాది మంది జీవనాధారం కోల్పోయి రోడ్డున పడితే వారిని పట్టించుకోలేదు కానీ, హైదరాబాద్‌లో ప్రజలు మాత్రం ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారో నగరవాసులు అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News