Heavy Rains Alert: తెలంగాణలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు , బయటికి వెళ్లవద్దని హెచ్చరిక జారీ

Heavy Rains Alert: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2023, 05:13 PM IST
Heavy Rains Alert: తెలంగాణలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు , బయటికి వెళ్లవద్దని హెచ్చరిక జారీ

Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా వ్యాపిస్తోంది. ఫలితంగా తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమగా విస్తరిస్తూ బలపడుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది.  ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి విస్తరిస్తూ ఉత్తర కోస్తాంధ్ర నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. గాలులు పశ్చిమ దిశగా వీస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. 

ఇవాళ, రేపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. నిన్న రాత్రి కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

మెదక్ జిల్లా నర్శాపురం లో 6, సంగారెడ్డి జిల్లా జోగిపేట్‌లో 5, వరంగల్‌లో 4, నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో 4, మెదక్ జిల్లా పాపన్నపేట్‌లో 4, నిజామాబాద్ జిల్లా రంజల్‌లో 4, మేడ్చల్‌లో 3, వికారాబాద్ జిల్లా మార్పల్లెలో 3, మల్కాజ్‌గిరిలో 3,  కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 2,  సూర్యాపేట జిల్లా నూతంకల్‌లో 2, షేక్‌పేట్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Also read: Telangana Bjp: బీజేపీ నేతలను ఊరిస్తున్న కేంద్ర పదవులు<

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News