Hyderabad:''అడ్డమోస్తే మర్డర్ చేస్తా..".. కండక్టర్ పై దాడిచేస్తూ రెచ్చిపోయిన యువతి.. సజ్జనార్ సీరియస్..

TSRTC Bus: బస్సులో కండక్టర్ లను బూతులు తిడుతున్న వీడియో వైరల్ గా మారింది. చిల్లర లేదనడంతో సదరు మహిళ ఇష్టమోచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయింది. చిల్లర ఇవ్వాలన్న కండక్టర్ పై బూతులు తిడుతూ దాడులకు పాల్పడింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 31, 2024, 12:41 PM IST
  • - చిల్లర అడిగినందుకు బస్సులో రచ్చ చేసిన యువతి..
    - కండక్టర్ ను దూషిస్తు పిడిగుద్దులు..
    - ఘటనపై సీరియస్ అయిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
Hyderabad:''అడ్డమోస్తే మర్డర్ చేస్తా.."..  కండక్టర్ పై దాడిచేస్తూ రెచ్చిపోయిన యువతి.. సజ్జనార్ సీరియస్..

Woman Attacked on TSRTC Conductor: తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీబస్సు జర్నీ కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ బస్సు జర్నీలో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కొందరు మహిళలు ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.

కొన్ని చోట్ల సీట్ల కోసం మహిళలు వెంట్రుకలు పట్టుకొని కొట్టుకోవడం, చెప్పులతో కొట్టుకొవడం వంటి వీడియోలు వార్తలలో నిలిచాయి. అదే విధంగా కొందరు టికెట్ కు సరిపడా చిల్లవ ఇవ్వకుండా కండక్టర్ పై దాడి చేసిన ఘటనలు కొకొల్లలు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  

పూర్తి వివరాలు..

హైదరాబాద్ లో ఒక యువతి రెచ్చిపోయింది. మొదటి ట్రిప్పు బస్సు ప్రయాణంలో యువతి బస్సులోకి ఎక్కింది. కండక్టర్ కు టికెట్ కు సరిపడా చిల్లర ఇవ్వలేదు. అంతే కాకుండా.. చిల్లర ఇవ్వాలన్న కండక్టర్ పై బూతులు తిడుతూ దాడులకు పాల్పడింది.

చుట్టుపక్కల వారు ఎంతగా చెప్పిన వినిపించుకోకుండా కాలితో తన్నుతూ, అమానవీయంగా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా సదరు కండక్టర్ ఫోటోలు, వీడియోలు తీసి.. బస్సులో నానా రచ్చ చేసింది. ''ఇది తన అడ్డా అంటూ.. మర్డర్ చేస్తా ''అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ప్రయాణికులందరిని భయభ్రాంతలకు గురిచేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. 

Read Also: Viral Video: వావ్.. భక్తితో భజనలు చేస్తున్న శునకం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News