Munugode Bypoll: బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో కలకలం

JP Nadda: 2016లో మర్రిగూడలో పర్యటించారు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం అదే ఏడాది చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Edited by - Srisailam | Last Updated : Oct 20, 2022, 10:08 AM IST
  • మునుగోడు నియోజకవర్గంలో కలకలం
  • బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు సమాధి.
  • ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
Munugode Bypoll: బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో కలకలం

JP Nadda: తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేస్తున్న మునుగోడు ఉపఎన్నికలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో కలకలం రేగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో  బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు  సమాధి కట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రికి రాత్రే వెలిసిన సమాధి తీవ్ర దుమారం రేపుతోంది. జేపీ నడ్డాకు సమాధి కట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

2016లో మర్రిగూడలో పర్యటించారు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం అదే ఏడాది చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే నడ్డా హామ ఇచ్చి ఆరేళ్లు గడిచినా ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ రాలేదు. ఈ విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోం. గతంలో రీచెర్స్ సెంటర్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే  జేపీ నడ్డా సమాధి వెలిసింది. ఫ్లోరెడ్ బాధితులే ఇలా నిరసన తెలిపారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. అధికార పార్టీ నేతలే సమాధి కట్టారని.. ఫ్లోరెడ్ బాధితులతో సంబంధం లేదంటున్నారు. మునుగోడులో బీజేపీ వస్తున్న ఆదరణతో ఓటమి ఖాయమని గ్రహించిన టీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా మద్దతు లేకనే చిల్లర చేష్టలకు దిగారన్నారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే బాధ్యులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేత గంగడి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also: Munugode Bypoll: నిద్రలేని రాత్రులు గడుపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకో తెలుసా?

Read Also: Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News