TSRTC Free Service: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం!

TSRTC Free Bus Pass: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి రవాణా సంస్థలో అనేక విన్నూత్న నిర్ణయాలను అమలు చేశారు. పండుగలు, సెలవు రోజుల్లో వివిధ ఆఫర్స్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చి.. టీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచారు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులను ఉచితంగా ప్రయాణించేందుకు సజ్జనార్ వీలు కల్పించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 01:21 PM IST
TSRTC Free Service: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం!

TSRTC Free Bus Pass: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రోడ్డు రవాణా సంస్థలో కొత్త ఒరవడిని సజ్జనార్ తీసుకొచ్చారు. విన్నూత్న నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లడం సహా ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేయడంలో ఆయన చాలా వరకు విజయం సాధించారు. పండుగలు, సెలవు రోజులతో పాటు ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణాలపై రాయితీలు, ఆఫర్స్ ప్రకటిస్తూ ఆ సంస్థ ఆదాయాన్ని పెంచారు. 

మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలకు స్పందించడమే కాకుండా, అనేక పరిష్కార చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న వేళ.. ఆయా విద్యార్థులకు సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులందరూ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు. 

ఈ మేరకు సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఆర్టీసీ నిర్ణయం పట్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు జరిగే రోజున విద్యార్థులు తమ తమ హాల్ టికెట్లను చూపించి.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు. పరీక్షా కేంద్రం నుంచి గమ్యస్థానానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు. 

Also Read: Pawan Kalyan: నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. తెలంగాణ రాజకీయాల్లో కాక

Also Read: Pawan Kalyan: తెలంగాణలో బలంగా ఉన్నాం.. వచ్చే ఎన్నిక్లలో సత్తా చాటుతాం! నల్గొండ పర్యటనలో పవన్ కల్యాణ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News