Pfizer's Covid Pill: కొవిడ్‌ చికిత్సకు ట్యాబ్లెట్ రూపొందించిన ఫైజర్...ఆమోదించిన అమెరికా

Covid Pill:  కరోనా కట్టడికి తొలిసారి ట్యాబ్లెట్ ను తీసుకొచ్చింది అమెరికా. పైజర్ రూపొందించిన  ‘పాక్స్‌లోవిడ్‌’ పిల్‌కు ఆ దేశం ఆమోదముద్ర వేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 02:07 PM IST
Pfizer's Covid Pill: కొవిడ్‌ చికిత్సకు ట్యాబ్లెట్ రూపొందించిన ఫైజర్...ఆమోదించిన అమెరికా

Pfizer Covid Pill: కొవిడ్ మహమ్మారి కట్టడికి ఇప్పటివరకు వ్యాక్సిన్(Vaccine) మాత్రమే అందుబాటులో ఉంది.. తాజాగా ఓ మాత్ర(Covid Pill)ను అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికా.  పైజర్(Pfizer) రూపొందించిన  ‘పాక్స్‌లోవిడ్‌’(Paxlovid) పిల్‌కు బుధవారం అనుమతినిచ్చింది. ఇంటివద్దే చికిత్స పొందుతూ...ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. చౌకగా లభించే ఈ మాత్ర కొవిడ్‌(Covid-19) ప్రారంభదశలో వేగవంతమైన చికిత్స అందించడానికి పనిచేస్తుందని తెలిపారు.

 కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారికి.. ఆసుపత్రిపాలయ్యే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ప్రారంభదశలోనూ ఈ మాత్రను వినియోగించవచ్చని అధికారులు తెలిపారు. ఈమేరకు ఫైజర్‌ మాత్రను వయోజనులకు, 12 ఏళ్లు.. ఆ పైబడిన పిల్లలకు వినియోగించేందుకు అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) అనుమతించింది.  

Also Read: Netherland Lockdown: ఒమిక్రాన్ తీవ్రత, జనవరి 14 వరకూ లాక్‌డౌన్ విధించిన నెదర్లాండ్

సౌతాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్(Omicron) ఇప్పుడు ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణిమించింది.. వ్యాక్సిన్‌పై ఎంత ప్రచారం చేసినా.. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌కు అందరూ ముందుకు రాకపోవడంతో.. ఇప్పుడు కొవిడ్ చికిత్సలో చేరిన తొలి టాబ్లెట్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైజర్‌ సంస్థ ఇప్పటికే కోటికిపైగా టాబ్లెట్ల(Tablet)ను సిద్ధం చేసింది.. ఇప్పుడు అనుమతి కూడా లభించడంతో.. ఉత్పత్తి మరింత పెంచేందుకు ఆ సంస్థ రెడీ అవుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News