Marriage Season 2022: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, నెలరోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..ఖర్చు ఎంతో తెలుసా

Marriage Season 2022: దసరా, దీపావళి తరువాత మరో బొనాంజా తగలనుంది వ్యాపారులకు. మరో నెలరోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఎన్ని పెళ్లిళ్లు జరగనున్నాయో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2022, 09:13 PM IST
Marriage Season 2022: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, నెలరోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..ఖర్చు ఎంతో తెలుసా

దేశంలో పెళ్లిళ్ల ముహూర్తం సమీపిస్తోంది. దేశమంతా మరో వారం రోజుల తరువాత పెళ్లిబాజాలు ప్రారంభమౌతాయి. ఏ ఊరిలో..ఏ మూల చూసినా పెళ్లి సందడి కన్పించనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న పెళ్లిళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మొన్నటివరకూ ఫెస్టివల్ సీజన్. ఇప్పుడిక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెళ్లి బాజాలు మార్మోగనున్నాయి. పెళ్లిళ్లకు అనువైన మంచి ముహూర్తం కావడంతో భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. ఓ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం నెలరోజుల వ్యవధిలో 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని తెలుస్తోంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకూ అంటే నెలరోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు జరగవచ్చని అంచనా. ఎన్ని కోట్లు ఖర్చు కానుందో తెలిస్తే..నోరెళ్లబెట్టేయడం ఖాయం.

నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకూ 32 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా ఉంది. ఈ పెళ్లిళ్ల నిమిత్తం ఏకంగా 3.75 లక్షల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా.

సీఏఐటీ లెక్కల ప్రకారం ఒక్కొక్క పెళ్లికి 3 లక్షల రూపాయల చొప్పున 5 లక్షల పెళ్లిళ్లు జరగవచ్చు. ఇక మరో పదిలక్షల పెళ్లిళ్లలో పెళ్లికి 5 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు. మరో పది లక్షల పెళ్లిళ్లలో పెళ్లికి పది లక్షల రూపాయలు, ఇంకో 5 లక్షల పెళ్లిళ్లలో పెళ్లికి 25 లక్షల రూపాయలు, 50 వేల పెళ్లిళ్లలో పెళ్లికి 50 లక్షల రూపాయలు, చివరి 50 వేల పెళ్లిళ్లలో పెళ్లికి 1 కోటి రూపాయల చొప్పున ఖర్చు కావచ్చు. మొత్తం ఖర్చు చూస్తే..3.75  లక్షల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా.

డిసెంబర్ తరువాత కొద్దికాలం పెళ్లిళ్లకు బ్రేక్ ఉంటుంది. తిరిగి జనవరి 14, 2023 తరువాత ప్రారంభమౌతుంది. ఢిల్లీలో వచ్చే నెలరోజుల వ్యవధిలో 3.5 లక్షల కంటే ఎక్కువ పెళ్లిళ్లు జరగవచ్చని అంచనా. ఈ పెళ్లిళ్లకు 75 వేల కోట్లు ఖర్చు కావచ్చు. గత ఏడాది ఇదే కాలంలో దాదాపు 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. ప్రతి పెళ్లికి 3 లక్షల రూపాయలు ఖర్చైందని అంచనా.

పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం పుంజుకోవచ్చు. దేశవ్యాప్తంగా వ్యాపారులు వ్యాపార ఏర్పాట్లలో మునుగుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది దీపావళి రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. పెళ్లిళ్లలో ఏ విభాగాని ఎంత ఖర్చు కానుందనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. 20 శాతం ఖర్చు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుపై ఉంటుందని అంచనా. మిగిలిన 80 శాతం ఖర్చు పెళ్లి నిర్వహణకు ఉంటుంది.

పెళ్లికి ముందు ఇంటి మరమ్మత్తులకు చాలా ఖర్చు అవుతుందని సీఏఐటీ అంచనా వేస్తోంది. ఇది కాకుండా ఆభరణాలు, చీరలు, బట్టలు, ఫర్నీచర్, రెడీమేడ్ దుస్తులు, చెప్పులు, గ్రీటింగ్ కార్డులు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, పండ్లు, పూజా సామగ్రి, కిరానా, అలంకరణ సామగ్రి, ఇంటి డెకొరేషన్ సామగ్రి, విద్యుత్ బిల్లు, ఎలక్ట్రానిక్స్, పెళ్లి మండపాల ఖర్చు ఇలా చాలా విభాగాలున్నాయి.

దేశంలోని పెళ్లిళ్లకు మ్యారేజ్ హాల్,హోటల్, ఓపెన్ లాన్ ఇలా చాలా అంశాలకు భారీగా ఖర్చవుతుంది. పెళ్లితో పాటు టెంట్ డెకొరేషన్, పూల డెకొరేషన్, క్రాకరీ, భోజన ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు, క్యాబ్ సర్వీసెస్, స్వాగత సిబ్బంది, కూరగాయలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆర్కెస్ట్రా ఇలా చాలా సేవలు అందుబాటులో ఉంటాయి. చివరిగా వీటన్నింటికీ తోడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా ఉంటుంది.

Also read: SBI Share Updates: ఆల్ టైమ్ హైకు చేరుకున్న ఎస్బీఐ షేర్, షేర్ ఎంత పెరిగిందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News