Nagarjuna:మాల్దీవ్స్ కి టికెట్లు రద్దుచేసుకున్న నాగార్జున.. మోడీకి సపోర్ట్ వ్యక్తంచేసిన హీరో

Naa Saami Ranga: ప్రస్తుతం నాగార్జున తన సంక్రాంతి సినిమా నా సామి రంగ చిత్రం ప్రమోషన్స్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున వెకేషన్ కి ప్లాన్ చేసుకొని మరి టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు అనే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 11:42 AM IST
Nagarjuna:మాల్దీవ్స్ కి టికెట్లు రద్దుచేసుకున్న నాగార్జున.. మోడీకి సపోర్ట్ వ్యక్తంచేసిన హీరో

Nagarjuna Joins Anti-Maldives Movement: గత కొద్ది రోజులుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగా సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసి పైన ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా రేపు జనవరి 14న థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఒకప్పటి నాగార్జున అని చూసినట్టు ఉందని ఈ సినిమా తప్పకుండా హిట్ వుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. గత కొద్దిరోజులుగా నాగార్జున నా సామిరంగా సినిమా షూటింగ్ తో పాటు బిగ్ బాస్ చిత్రీకరణలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే బిగ్ బాస్ ప్రోగ్రాం షూటింగ్ ముగిసింది. మరోపక్క నా సామి రంగా సినిమాని త్వరగా పూర్తి చేయడానికి వరసగా మూడు నెలలు రెస్టు లేకుండా శ్రమించారు నాగ్. ఈ నేపథ్యంలో కొంచెం రెస్ట్ తీసుకుందామని వేకేషన్ ప్లాన్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకున్న నాగార్జున ఇప్పుడు మాత్రం ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారట.

అసలు విషయానికి వస్తే మాల్దీవులకు వ్యతిరేకంగా భారత్ లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. ఇండియా నుంచి వేల సంఖ్యలో ట్రిప్స్ కాన్సిల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడీ లిస్ట్ లోకి మన కింగ్ నాగార్జున కూడా చేరారు. మొన్నటి వరకు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసిన నాగార్జున, నా సామిరంగ సినిమా రిలీజ్ తర్వాత, మాల్దీవులు వెళ్లి కాస్త రిలాక్స్ అవుదాం అని ప్లాన్ వేసుకున్నారట. కానీ ప్రస్తుతం జరిగిన పరిణామాలతో ఆయన తన మాల్దీవుల టూర్ రద్దు చేసుకున్నారు.

ఇదే విషయం గురించి తెలియజేస్తూ..”నా సామిరంగా..బిగ్ బాస్ తో కలిపి 75 రోజులు నాన్ స్టాప్ గా పనిచేశాను. అందుకే చిత్ర  రిలీజ్ తర్వాత రిలాక్స్ అవ్వాలనుకున్నాను. ఈనెల జనవరి 17న వెళ్దామని బుక్ చేశాను, కానీ ఈమధ్య జరిగిన సంఘటనల వల్ల టిక్కెట్లన్నీ కాన్సిల్ చేశాను. ఇంతకుముందు చాలాసార్లు వెళ్లాను. ఈసారి మాత్రం రద్దు చేశాను. ఇదేదో ఎవరో ఏదో అనుకుంటారని లేదా భయపడి చేసింది కాదు. మాల్దీవులు మంత్రులు మన గురించి మాట్లాడిన మాటలు మంచివి కావు. మన దేశ ప్రధానిని ఉద్దేశించి వాళ్లు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు.అవి సత్సంబంధాల్ని దెబ్బతీస్తాయి.” అని చెప్పుకొచ్చారు నాగార్జున.

కాకా ఈ విధంగా మన దేశంలో మాల్దీవులకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలోకి నాగార్జున కూడా చేరారు. ఇప్పటికీ తనకు చాలా అలసటగా ఉందని, నా సామిరంగ సక్సెస్ అయితే తన అలసట మొత్తాన్ని తాను తప్పకుండా మర్చిపోతానని తెలియజేశారు ఈ హీరో. ప్రస్తుతం నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం.. నాగర్జున చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News