The Kerala Story: చివరికి ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ.. ఎప్పుడో తెలుసా?

The Kerala Story OTT: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి రికార్డు వసూళ్లను సాధించిన ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీ రైట్స్ కొనడం కోసం ఒక్క ఓటీటీ సంస్థ కూడా వెంటనే ముందుకు రాలేదు. డిజిటల్ రైట్స్ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ మూవీని యూట్యూబ్‌ లో రిలీజ్ చేసే ప్లాన్స్ కూడా చేశారు. కానీ చివరికి జీ 5 వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. త్వరలోనే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఓటీటీ లలోకి రాబోతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 07:46 AM IST
The Kerala Story: చివరికి ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ.. ఎప్పుడో తెలుసా?

The Kerala Story

చాలా వరకు పెద్ద సినిమాల డిజిటల్ రైట్స్ విడుదలకి ముందే అమ్ముడు అయిపోతూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి. 

అందులో ఒక సినిమానే ది కేరళ స్టోరీ. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సుదిప్టో సేన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ల తో పాటు ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చులతో కలిపి సినిమా కోసం 28 కోట్లకుపైగా బడ్జెట్‌ ఖర్చయింది.

ఈ సినిమా కి సుమారుగా 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా భారత దేశం లో 2000 స్క్రీన్లలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య గతేడాది మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం హిందీ వెర్షన్ 240 కోట్లకుపైగా సంపాదించగా, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు, తెలుగులో 3 కోట్ల రూపాయలు అలాగే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూళ్లు నమోదు చేసుకుంది.  

అయితే బాక్స్ ఆఫీసు వద్ద ఇంత భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్ లలో మిస్ అయిన వాళ్ళు కనీసం ఓటీటీ లో అయినా చూద్దాం అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 6 నెలలు దాటినా కూడా ఈ సినిమా మాత్రం ఓటీటీ లో ఇంకా విడుదల కాలేదు.

ఈ నేపథ్యంలో ఓటీటీ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను కనీసం యూట్యూబ్‌ లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్స్ కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషం లో జీ 5 వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. త్వరలోనే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఓటీటీ లలోకి కూడా రాబోతోంది అని సమాచారం. 

జీ 5 వారు చిత్ర డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నట్టు తెలుస్తోంది. జనవరి 12న లేదా జనవరి 19వ తేదీన సినిమా ను జీ 5 లో రిలీజ్ చేయబోతున్నారు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News