Manchu Vishnu: ఎవరు ఊహించని రేంజ్ లో కన్నప్ప... పోస్టర్ తోనే సెన్సేషన్

Happy Birthday Manchu Vishnu : మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తన తదుపరి సినిమా కన్నప్ప పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొదటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు పెంచుతూ వచ్చాడు విష్ణు. ఇక ఆ అంచనాలు తప్పకుండా నెరవేరుస్తాను అన్నట్టు ఈరోజు విష్ణు రిలీజ్ చేసిన పోస్టర్ ఎవరు ఊహించని రేంజ్ లో ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2023, 10:10 AM IST
Manchu Vishnu: ఎవరు ఊహించని రేంజ్ లో కన్నప్ప... పోస్టర్ తోనే సెన్సేషన్

Kannappa: ప్రస్తుతం సూపర్ హిట్ల కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోల్లో మంచు విష్ణు ఒకరు. విష్ణు సినిమాతో మోహన్ బాబు కొడుకుగా మనకు పరిచయమైన ఈ హీరో ఆ తరువాత తన కెరియర్లో ఢీ లాంటి సూపర్ హిట్ కూడా అందుకున్నారు. కొన్ని కామెడీ చిత్రాలతో మంచి హిట్లే అందుకున్న విష్ణు కి ఈ మధ్య మాత్రం కెరియర్ అంత బాగా కొనసాగలేదు. వరసగా ఫ్లాపులు రావడంతో ప్రస్తుతం ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ అందుకోవాలని కసి పైన ఉన్నాడు.

ఈ మధ్యనే మా ఎలక్షన్స్ లో తన సత్తా చూపించిన విష్ణు.. ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఆ సినిమానే కన్నప్ప. మంచు విష్ణు అలానే మోహన్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకులకు దీనిపై అంచనాలు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్  నయనతార లాంటి వారు ఒక్కొక్కరు జాయిన్ అవుతూ రావడం. కాగా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఈరోజు నవంబర్ 23 పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ఒక పోస్టర్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ పోస్టర్స్ చూస్తేనే ఈ సినిమా హై వేల్యూస్ తో రానుంది అని అర్థమవుతుంది. కన్నప్పగా విష్ణు ఎలా కనిపించబోతోన్నాడో ఈ పోస్టర్లో క్లియర్‌గా అయితే చూపించలేదు. కానీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పేలా ఓ పోస్టర్‌ను వదిలారు. బర్త్ డే స్పెషల్‌గా వదిలిన ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం సినిమా మీద ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా ఉంది. 

కొండల మధ్య నీళ్లలో శివుడి ఆకారం దాని మధ్యలో కన్నప్ప గెటప్ లో మంచు విష్ణు వెనక నుంచి కనిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్.. ఈ సినిమా విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి అని చెప్పకనే చెప్పేసింది. 

ఇక ఈ చిత్రం షూటింగ్ అంతా కూడా న్యూజిలాండ్‌లోనే జరుగుతూ ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమా తీన్ అంతా అక్కడే ఉన్నారు. దాదాపు 80 శాతం షూటింగ్ న్యూజిలాండ్‌లోనే ఉంటుందట. ఆల్రెడీ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట.. మొత్తం పైన మంచు విష్ణు కన్నప్ప ఓ విజువల్ వండర్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు అనుకున్న బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూద్దాం.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News